Zodiac Signs : మిథున రాశి వారికి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Zodiac Signs : మార్చి నెల 2022 సంవత్సరంలో మిథున రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వాళ్లకు అష్టమంలో పంచగ్రహ కూటమి ఉంది. నవమిలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. అష్టమంలో పంచగ్రహ కూటమి సంచరిస్తున్నందున మిథున రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. మిశ్రమంలో కూడా కాస్త లాభాల శాతం ఎక్కువగా, నష్టాల శాతం తక్కువగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మిథఉన రాశి వాళ్లు చాలా లాభాలు పొందబోతున్నారు.
అదే విధంగా ఉద్యోగ రంగం వాళ్లకు ఉన్న సమస్యలన్నీ ఈ మాసంలో తొలగిపోయే అవకాం ఉంది. అయితే పంచగ్రహ కూటమి వల్ల మీరు ఈ మాసంలో ఎక్కువగా లేదా తరచుగా ప్రయాణాలు చేస్తారు. అలాగే విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది చక్కటి మాసం. ఈ నెలలో ప్రయత్నం చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. పరిశోధన రంగంలో ఉన్న వాళ్లకు కూడా అనకూలమైన వాతావరణం ఉంది. గృహాలు కొనుక్కోవాలనుకునే వారు ఈ నెలలో చక్కగా ఇళ్లను కొనుగోలు చేయవచ్చు.

horoscope march 2022 check your zodiac signs gemini
అప్పులు ఎవరికీ ఇవ్వకపోవడం, తీస్కోకపోవడం మంచిది. అలాగే తండ్రి తరఫు వాళ్లకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.
