Funky Movie Review : విశ్వ‌క్ సేన్‌ ఫంకీ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 February 2026,10:23 pm

ప్రధానాంశాలు:

  •  Funky Movie Review : విశ్వ‌క్ సేన్‌ ఫంకీ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

నటీనటులు : విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌, సీనియర్ నరేశ్ తదితరులు.
దర్శకుడు : అనుదీప్‌ కేవీ
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం : సురేష్ సారంగం
కూర్పు : నవీన్ నూలి

Funky Movie Review : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ  Producer Naga Vamsi , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం Funky Movie  ‘ఫంకీ’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మాస్ కా దాస్ vishwak sen విశ్వక్ సేన్ హీరోగా, కాయదు లోహర్ Kayadu Lohar హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం Anudeep KV  వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సురేష్ సారంగమ్ సినిమాటోగ్రఫీ అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. నవీన్ నూలీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) ఇటీవల వీక్షించింది.

Funky Movie Review : విశ్వ‌క్ సేన్‌ ఫంకీ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Funky Movie Review : విశ్వ‌క్ సేన్‌ ఫంకీ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Funky Movie Review క్లీన్ సర్టిఫికెట్ – యూఏ 7+ రేటింగ్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి UA 7+ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకపోవడంతో క్లీన్ సర్టిఫికెట్ లభించినట్టు సమాచారం. ఏడు సంవత్సరాలు దాటిన పిల్లలు పెద్దల పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని బోర్డు సూచించింది. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్, ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన బలాలుగా ఉన్నాయని సెన్సార్ రివ్యూ తర్వాత అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Funky Movie Review ఫన్, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్

టీజర్, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ఈ సినిమా ఫన్ రైడ్‌గా ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చింది. అనుదీప్ తనదైన కామెడీ టచ్‌తో స్ట్రీట్ లెవెల్ హ్యూమర్‌ను ఫెయిర్‌గా ప్రెజెంట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. విశ్వక్ సేన్ ఈ సినిమాలో గత చిత్రాల కంటే భిన్నమైన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో కనిపించనున్నాడు. హీరోయిన్ కాయదు లోహర్ గ్లామర్ డోస్‌తో పాటు డ్యాన్స్ నంబర్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ చెబుతోంది.

Funky Movie Review షార్ట్ అండ్ క్రిస్ప్ రన్‌టైమ్

ఈ చిత్రానికి ఎడిటర్ నవీన్ నూలీ కట్టుదిట్టమైన ఎడిటింగ్ అందించడంతో సినిమా నిడివి ఎక్కువ కాకుండా కంట్రోల్ చేశారు. ‘ఫంకీ’ రన్‌టైమ్ 2 గంటలు 8 నిమిషాలు (128 నిమిషాలు) గా ఫిక్స్ చేశారు. ఫాస్ట్ పేస్ నేరేషన్‌తో సినిమా సాగుతుందని చిత్రబృందం చెబుతోంది.మొత్తానికి ఫన్, ఎమోషన్స్, రొమాన్స్ మేళవింపుతో తెరకెక్కిన ‘ఫంకీ’ కుటుంబ సమేతంగా చూసే ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

క‌థ‌: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఫంకీ సినిమాలో కోమల్ అనే అభిలాష గల ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తుండగా, హీరోయిన్‌గా కయాదు లోహర్ చిత్ర పాత్రలో నటిస్తోంది. సినిమా స్టోరీ లైన్ ఆసక్తికర మలుపులతో సాగుతుంది. కథ ప్రకారం కోమల్ ఒక అప్‌కమింగ్ డైరెక్టర్. తన తొలి సినిమా కోసం నిర్మాతకు నాలుగు కోట్లు ఖర్చవుతుందని చెప్పి, ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. కానీ షూటింగ్ మధ్యలో బడ్జెట్ కంట్రోల్ తప్పిపోవడంతో ఖర్చు ఏకంగా నలభై కోట్లకు చేరుతుంది. ఈ ఆర్థిక దెబ్బను తట్టుకోలేక నిర్మాత అనారోగ్యానికి గురవుతాడు. ఆ సమయంలో రంగంలోకి దిగేది నిర్మాత కూతురు చిత్ర.

తండ్రి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చిత్ర స్వయంగా సినిమా బాధ్యతలు చేపడుతుంది. మిగిలిన చిత్రీకరణను కేవలం ఒక కోటి రూపాయల బడ్జెట్‌తో పూర్తి చేయాలని కోమల్‌కు ఛాలెంజ్ విసురుతుంది. దీంతో కథలో అసలు ట్విస్ట్ ప్రారంభమవుతుంది. తక్కువ బడ్జెట్‌లో భారీ సినిమా పూర్తి చేయాలనే ఒత్తిడి, కోమల్ సృజనాత్మకత, చిత్ర కఠిన నిర్ణయాలు కథను నాటకీయంగా మలుస్తాయి.

ఈ క్రమంలో కోమల్ నిజంగా బడ్జెట్‌లో సినిమా పూర్తి చేశాడా? లేక మరోసారి ఖర్చులు పెంచాడా? కోమల్–చిత్ర మధ్య ఏర్పడే విభేదాలు, భావోద్వేగ సన్నివేశాలు, చివరికి వారి సంబంధం ఏ దిశగా వెళ్తుంది? ‘ఫంకీ’ సినిమా భవిష్యత్తు ఏమవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర మిగతా కథ కామెడీ, ఎమోషన్, డ్రామా మిళితంగా సాగే ఈ కథ ప్రేక్షకులకు వినోదంతో పాటు ఇండస్ట్రీలోని బడ్జెట్ వాస్తవాలను కూడా చూపించబోతుందనే అంచనాలు ఉన్నాయి.

 

విశ్లేష‌ణ‌:

టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందనను రాబడుతోంది. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నప్పటికీ, కథా-పాత్రల ఎంపిక విషయంలో హీరో తీసుకున్న నిర్ణయం పై సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. సినిమాలో ఆయన కనిపించిన పాత్ర పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో, ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ సీక్వెన్స్‌లలో విశ్వక్ సేన్ నటనకు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి.

ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది హీరోయిన్ కయాదు లోహర్. గ్లామర్‌తో పాటు నటనలోనూ ఆమె మెప్పించిందని ప్రేక్షకుల అభిప్రాయం. సరైన కథలు, బలమైన పాత్రలు ఎంచుకుంటే ఇండస్ట్రీలో దీర్ఘకాలం కొనసాగగల సామర్థ్యం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే సీనియర్ నటుడు వి.కె. నరేష్ తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచగా, దర్శకులు దిల్ రాజు, హరీష్ శంకర్, అనుదీప్ కేవీ అతిథి పాత్రల్లో కనిపించి కాసేపు జోష్ తెచ్చారు. ఇతర నటీనటులు తమ పాత్రల మేరకు ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రంలో తన పూర్తి స్థాయి మ్యాజిక్ చూపించలేకపోయారనే అభిప్రాయం వినిపిస్తోంది. రెండు పాటలు మినహా మిగతా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్దగా ప్రభావం చూపలేదని విమర్శలు ఉన్నాయి. ఎడిటర్ నవీన్ నూలీ పనితీరుపై కూడా మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండగా, సినిమాటోగ్రఫీ విషయంలో సురేష్ సారంగంకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం హై క్లాస్‌లో ఉన్నప్పటికీ, కథ-కథనాల బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి ‘ఫంకీ’ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే మంచి కంటే లోపాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని వన్-లైనర్ డైలాగులు, అతిథి పాత్రలు, హీరోయిన్ ప్రెజెన్స్ తప్ప చిత్రంలో బలమైన అంశాలు తక్కువగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపికగా, పెద్ద అంచనాలు లేకుండా చూస్తే కొంతవరకు ఎంటర్‌టైన్ చేయగలదన్న అభిప్రాయంతోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి