Zodiac Signs : సింహ రాశి వారికి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Zodiac Signs : మార్చి నెల 2022 సంవత్సరంలో సింహ రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి సప్తమంలో రవి సంచారం జరుగుతుంది. అలాగే ఆరవ ఇంట అంటే షష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి సంచరిస్తుంది. అందువల్ల సింహ రాశి వాళ్లకు ఈ మాసం అంతా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక విషయాలన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. అంటే చేతినిండా డబ్బు ఉంటుంది. అవసరమైనపుడు వెంటనే డబ్బు మీ చేతికి అందుతుంది.
అనుకోని మార్గాల ద్వారా కూడా మీకు లాభాలు వస్తాయి. అదే విధంగా ఫార్మా, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వాళ్లకి లాభాలు ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. మీరు ఊహించని లాభాలు వస్తాయి. అయితే మీరు ఇండ్ల వంటివి కొనాలనుకుంటే… ఆ కాగితాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఆ తర్వాత సంతకాలు పెట్టడం చాలా మంచిది. అయితే ముఖ్యంగా ఈ మాసంలో మీకు ఆర్థిక పరమైనటువంటి ఆందోళన ఉంటుంది. వివాహ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఆ ప్రయత్నాలను ఈ మాసంలో మానుకోవడం మంచిది.

horoscope march 2022 check your zodiac signs leo
17, 20, 21వ తేదీలు సింహ రాశి వాళ్లకి చాలా అనుకూలమైనవి. ఏవైనా పనులు ప్రారంభించాలనుకున్న వాళ్లు ఈ రోజున మొదలు పెడితే అనుకున్నది కచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.
