Today Horoscope : దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి అంతా శుభం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Horoscope : దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి అంతా శుభం..!

 Authored By prabhas | The Telugu News | Updated on :24 November 2021,10:00 pm

మేషరాశి ఫలాలు :ఈరోజు అనుకోని అవాంతరాలు, సమస్యలు ఎదురుకావచ్చు. పనులలో వేగం తగ్గుతుంది. అనుకోని చోట నుంచి ఖర్చులు వస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచన. ఉద్యోగాలలో నిరాశ. విద్యార్థులకు శ్రమ. సాయిబాబా దేవాలయ దర్శనం చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మీకు అనుకున్నదాని కంటే ఎక్కువ సంతోషం లభిస్తుంది. పెద్దల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మిత్రుల సాయం అందుతుంది. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభ వార్త శ్రవణం. శ్రీ దత్త కవచం పారాయణం లేదా వినడం చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. పనులు వేగంగా చేయలేకపోతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలం. వ్యాపారాలలో ఇబ్బందులు.ఆర్థిక మందగమనం. ఆఫీస్‌లో పనులలో, వ్యవహారాలలో జాప్యం. ఆరోగ్య సమస్యలు. విద్యార్థుల చదువు మందగిస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ఉత్సాహంగా ముందుకుపోతారు. ఆస్థిలాభం, ధనం పరిపూర్ణంగా ఉంటుంది. విద్యార్థులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో గౌరవం లభిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఆటంకాలు. ఆఫీస్‌లో ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కనిపించవచ్చు. అనుకోని ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమించాల్సిన సమయం. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి.

కన్యరాశి ఫలాలు :ఈరోజు అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు. ధనం సమృద్ధిగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. కార్యసిద్ధి. మీ పేరుప్రఖాత్యతలు పెరుగుతాయి. ఆఫీస్‌లో పనులు అనుకూలిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.

తులారాశి ఫలాలు : ఈరోజు లాభాలు వస్తాయి. వ్యాపారాలు మంచి దశలో ఉంటాయి. ఆర్థికంగా సంతోషకరమైనరోజు. విద్యార్థులకు శుభ వార్తలు. పెద్దల పరిచయాలు. ఆఫీస్లో అనుకూల మార్పులు. వైవాహికంగా సంతోషకరమైన రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో పనులు మందగమనంలో ఉంటాయి. కుటుంబంలో సభ్యుల మధ్య పరస్పర విరుద్ధ భావనలు.. అనుకోని ఖర్చులు. సమస్యలు. విద్యార్థులకు శ్రమ. శ్రీ కృష్ణ ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ప్రయాణాలు కలసి రావు. శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆఫీస్‌లో ఆటంకాలు. డబ్బు సంబంధ వివాదాలు. వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. విద్యార్థులకు మంచి ఫలితాల కోసం బాగా శ్రమించాల్సిన రోజు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు కార్యజయం. సంతోషం. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ఆఫీస్ వ్యవహారాలలో విజయం. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తాలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు ప్రతి పనిలో ఇబ్బందులు. కుటుంబ సభ్యులలో ఆందోళన, ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ఆర్థిక ఇబ్బంది. వ్యాపారాలు మామూలుగా ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు మీ మనస్సులో ఆందోళన, ప్రతి పనిలో మందగమనం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆఫీస్లో ఇబ్బంది కలిగించే పరిస్తితి కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి రోజు. విందులు, వినోదాలలో పాల్గొంటారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది