Horoscope Today : న‌వంబ‌ర్‌ 20 2021 శనివారం మీ రాశిఫ‌లాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Horoscope Today : న‌వంబ‌ర్‌ 20 2021 శనివారం మీ రాశిఫ‌లాలు

 Authored By keshava | The Telugu News | Updated on :19 November 2021,10:17 pm

నవంబర్  20  శనివారం మేషరాశి ఫలాలు : ఈరోజు ఆస్తి వ్యవహారాలకు అనుకూలం. అనుకోని లాభాలు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆఫీస్లో అనుకూల వాతావరణం. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.  వృషభరాశి ఫలాలు : ఈరోజు పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి బాగుటుంది. ఇంటి పనులు వేగంగా పూర్తిచేసి త్వరగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు బాగుంటాయి. ఇష్టమైన వారిని కలుస్తారు. ఆరోగ్యం కోసం శివ పూజ చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమికుల మధ్య సామరస్యం వెల్లివిరుస్తుంది. పాత మిత్రులను కలుస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడుతాయి. ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు స్పెకులేషన్ లాభాలు వస్తాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. వివాదాలకు అవకాశం ఉంది. పెద్దల మాట వినకపోవడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. పేదలకు అన్నదానం చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతమైన సంతోషకరమైన రోజు. ఆత్మ విశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విజయానికి ఈరోజు బాట వేస్తుంది. విద్యార్థులు మంచి మార్గంలో పయనిస్తారు. లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. శాంతియుత వాతావరణం. కోపాన్ని అధిగమించాలి. మీ విజయాలకు ప్రణాళిక సిద్దం చేస్తారు. ఆఫీస్లో ప్రశంసలు. విద్యార్థులకు మంచి సమయం. రుద్రాక్ష ధారణ చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు ధనం అవసరం పెరుగుతుంది. వైవాహికంగా సంతోషంగా గడుస్తుంది. ఆఫీస్లో మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. ఆర్థిక అవససరాల కోసం పెద్దవారిని సంప్రదిస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఫుల్ ఎనర్జీతో పనిచేస్తారు. ధనాన్ని పొదుపు చేస్తారు. పెద్దల సలహాలను తీసుకుని ముందుకు వెళ్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాచార నైపుణ్యాలను బాగా ప్రదర్శిస్తారు. స్నేహితులు సర్ప్రైజ్ ఇస్తారు. ఆనందంగా గడుపుతారు. శివాలయంలో దీపారాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాల్సిన సమయం. గ్రహాల చలనాల రీత్యా ఆర్థిక పరిస్తితి చాలా బాగుంటుంది. రుణాలను తీరుస్తారు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావచ్చు. మంచి విశ్రాంతి లభిస్తుంది. వైవాహికంగా ప్రశాంతమైన రోజు. విష్ణు సహస్రనామాలను ఆరాధించండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు ఆర్తిక సమస్యలు తీరుతాయి. ప్రేమ పారవశ్యంలో మునిగి తేలుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక వెల్లివిరుస్తుంది. బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిమాణాలు వుంటాయి. అనుకోని ధనం చేతికి అందుతుంది. శ్రీ విష్ణుమూర్తి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక లబ్దిని పొందుతారు. స్నేహితులు ఇబ్బందులకు గురిచేస్తారు. వైవాహిక జీవితం అద్భుతంగా సాగుతుంది. వ్యాపారాలు లాబాల బాటలో సాగుతాయి. ఆనందంగా గడుపుతారు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు అప్పులు చేయకండి. కోర్టు వ్యవహారాలు జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి. జీవిత భాగస్వామి నుంచి సమస్యలు రావచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు సంతోషమైన వార్తలు వింటారు. శ్రీశివాభిషేకం చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది