Zodiac Signs : సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి అద్భుతమైన రాజయోగం…!!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా అనేక రకాల శుభ ఘడియలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొన్ని అశుభయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. అయితే గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా శుభయోగలు ఆశుభయోగలు అనేవి అన్ని రకాల రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు తన సొంత రాశి అయినటువంటి కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశుల […]
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా అనేక రకాల శుభ ఘడియలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొన్ని అశుభయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. అయితే గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా శుభయోగలు ఆశుభయోగలు అనేవి అన్ని రకాల రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు తన సొంత రాశి అయినటువంటి కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఘడియలు ఏర్పడనున్నాయి. మరి బుధుడు సంచారం కారణంగా రాజయోగం పొందే రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహరాశి.. దాదాపు ఏడాది తర్వాత ఏర్పడనున్న మహాపురుష రాజయోగం వలన సింహరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో గణనీయమైన లాభాలను ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపార రంగాలలో లాభసాటిగా దూసుకుపోతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో సింహ రాశి వారు ఎలాంటి పని మొదలుపెట్టిన విజయవంతం అవుతుంది. సంతానపరంగా శుభవార్తలను వింటారు.
ధనస్సు రాశి.. దాదాపు సంవత్సరం తర్వాత బుధుడు తన సొంత రాశి అయినటువంటి కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు కాబట్టి ఇదే సమయంలో ఏర్పడే భద్ర మహా పురుష రాజయోగం ధనస్సు రాశి వారికి అన్ని రకాల శుభాలను అందిస్తుంది. రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలో పురోగతి సాధిస్తారు. ఎంతో కాలంగా వాయిదా పడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా గడుపుతారు.
కన్యా రాశి… ఏడాది తర్వాత ఏర్పడే ఈ భద్ర మహాపురుష రాజయోగం వలన కన్య రాశి వారికి సైతం అదృష్టం పడుతుందని చెప్పవచ్చు. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి ఊహించని ధన లాభం కలుగుతుంది. సరికొత్త ఆర్థిక వనరులు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. వర్తక మరియు వ్యాపార రంగాలలో రాణిస్తున్న వారికి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. సమాజంలో హోదా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.