Aries : మరో రెండు రోజులలో మేషరాశి వారి జీవితంలో వచ్చే కీలక మార్పులు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Aries : మరో రెండు రోజులలో మేషరాశి వారి జీవితంలో వచ్చే కీలక మార్పులు ఇవే..!

Aries : మరో రెండు రోజుల్లో మేషరాశి వారి జీవితంలో వచ్చే కీలక మార్పులు ఇవే.. మేష రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జరగబోయే ఆ భారీ మార్పులు ఏంటి.? ఇంకా ఆ ఊహించని సంఘటనలు ఏవో ఈరోజు చూద్దాం.. అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం. ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం. ఒకటో పాదం లో జన్మించిన వారు మేష రాశికి […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 July 2023,7:00 am

Aries : మరో రెండు రోజుల్లో మేషరాశి వారి జీవితంలో వచ్చే కీలక మార్పులు ఇవే.. మేష రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జరగబోయే ఆ భారీ మార్పులు ఏంటి.? ఇంకా ఆ ఊహించని సంఘటనలు ఏవో ఈరోజు చూద్దాం.. అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం. ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం. ఒకటో పాదం లో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు. మేష రాశి వారికి శని లాభ స్థానంలో సంచరించడం వల్ల మరో రెండు రోజుల్లో మీరు అనుకున్నటువంటి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొంతమేర శ్రమ కలిగినప్పటికీ కూడా విజయం సాధిస్తారు. మేష రాశి వారికి రాహువు యొక్క ప్రభావం చేత ఈ సమయంలో కుటుంబంలో కలహాలు కష్టాలు అధికంగా ఉంటాయి. అనుకూలమైనటువంటి శని ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఇక బృహస్పతి రాహువుతో కలిసి సంచరించడం వల్ల కుటుంబ విషయాలలో స్నేహితులలో వ్యవహరించే విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా పాటించాలి.

వేదనలు ఆందోళనలు పెరిగేటటువంటి సూచనలు అధికంగా ఉన్నాయి. మీ చుట్టూ అనేక రాజకీయాలు ఇలాంటివి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా గృహంలో మంగళకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉన్నత ఉద్యోగం వృద్ధి చెందుతుంది. ఇంకా కుటుంబ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంతానం వృద్ధి, ఆదాయం, గౌరవం ఇంకా ఇవన్నీ కూడా కలగబోతున్నాయి. సుబ్రమణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ సమయంలో మీకు చాలా వరకు మేలు చేస్తుంది. అనేక సవాళ్లను అధిగమించి ఆ విశ్రాంతంగా పనిచేస్తున్న మీకు మానసికంగా ఒత్తిడిని అధిగమించడం అనేది ముఖ్యంగా జన్మరాశిలో గృహస్పతి ఈ సమయంలో మీకు ఆశవాహ దృక్పథాన్ని మేలుకొలుపుతుంది. మేష రాశి వారు జన్మతః నాయకులు మీరు పోలీస్ మిలటరీ ఇంకా యుద్ధ సేకరణ బాగా రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీరికి ఎక్కువగా దర్శన జ్ఞానం ఉంటుంది.

key changes in the lives of Aries in the next two days

key changes in the lives of Aries in the next two days

ఆలయంలో పూజలు పెద్దలు మీ తల్లిదండ్రులు ఇంకా ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజలను పెద్దలు మీ తల్లిదండ్రులు ఇంకా ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సాయం చేయండి. ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే నీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుంది. ఇక శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి. మీ ఇంట్లో గాని లేదా మీ కుటుంబానికి చెందిన భూముల్లో గాని ఎప్పుడూ కూడా మీరు మీ చేతితో నిమ్మచెట్టును నాటొద్దు. మీరు ఎవరి దగ్గర నుంచి కూడా ఏ వస్తువులు ఉచితంగా స్వీకరించొద్దు. అది ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికే ప్రయత్నించండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు ఉంటాయి.

ఇక మేషరాశికి చెందిన వారు ఎరుపు, గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులుగా పరిగణించవచ్చు. ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ముఖ్యంగా ఎరుపు రంగు కర్చీఫ్ ను మీ చేతిలో నిరంతరం ఉంచుకోవడం వల్ల మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్ట బలం మరింత ఎక్కువగా ఉంటుంది.

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది