Kumbha Rashi Phalithalu కుంభ రాశి వారికి మీ సొంత ఇంట్లో, కుటుంబంలో మీకు తెలియకుండా ఉన్న శత్రువులు వీళ్ళే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kumbha Rashi Phalithalu కుంభ రాశి వారికి మీ సొంత ఇంట్లో, కుటుంబంలో మీకు తెలియకుండా ఉన్న శత్రువులు వీళ్ళే…

 Authored By aruna | The Telugu News | Updated on :1 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Kumbha Rashi Phalithalu కుంభ రాశి వారికి మీ సొంత ఇంట్లో, కుటుంబంలో మీకు తెలియకుండా ఉన్న శత్రువులు వీళ్ళే...

  •  Kumbha Rashi Phalithalu In Telugu

  •  మీకు తెలియకుండా ఉన్న శత్రువులు ఎవరో ఈ రోజు స్పష్టంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది. అలాగే వీరి జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి ఆ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి.

Kumbha Rashi Phalithalu మీకు తెలియకుండా ఉన్న శత్రువులు ఎవరో ఈ రోజు స్పష్టంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది. అలాగే వీరి జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి ఆ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి. అలాగే ఈ కుంభ రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం.. ఈ రాశి వారి మీద శని గ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రవర్తన వల్ల ఆవిరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రుడు కూడా శత్రువులుగా మారేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా వీళ్ళ ఆలోచనలు ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో మీరు తరచుగా చిక్కుకుంటారు. అంటే వీరి యొక్క నిర్లక్ష్య వైఖరి ఎక్కువగా ఉండటం వల్ల ఒక అనవసరమైన విషయాన్ని కూడా ఆ విషయంలో కూడా విపరీతమైనటువంటి పట్టుదలను చూపిస్తారు. దాని కారణంగా వీళ్ళు నష్టాల్లో చిక్కుకుపోతారు. ఇక కుంభ రాశి వారిని ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు.

కానీ అది ఎప్పుడు కార్యరూపం దాలు స్థాయి అనే విషయం ఎవరికీ తెలియదు. మంచి మంచి తెలివితేటలు ఉంటాయి. అంటే పరిస్థితులకు అనుగుణంగా తమను మార్చుకునేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి మొండితనం కూడా చాలా ఎక్కువ.. తనకు తాము తెలివితేటలు కలవాలని భావిస్తూ ఉంటారు. ఇక పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు మంచి బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా కోపం ఎక్కువగా ఉంటుంది. వీరికి స్వేచ్ఛ జీవితం పై ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి కుంభ రాశి వారికి మీ సొంత ఇంట్లోనే, కుటుంబంలోనే ముఖ్యంగా మీ జాతకంలోనే మీకు తెలియకుండా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. అయితే ఈ శత్రువులు మీ చుట్టూనే ఉంటారు. ఆన్ని తెలుసుకుని మీకు నష్టం కలిగించే విధంగా వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు మీరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చెప్పుకోవడం వల్ల కూడా మీకు సంబంధించిన రహస్య విషయాలు ఆ ఎదుటి వారికి తెలిసిపోవడంతో మిమ్మల్ని చిక్కుల్లోకి లాగుతారు. అంతేకాకుండా మీ పతనం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మీకు సంబంధించిన కొన్ని విషయాలను ఎంత ఇంట్లో వాళ్ళైనా సరే చెప్పుకోకుండా ఉండటమే మంచిది. అప్పుడే మీ యొక్క రహస్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటారు.

ముఖ్యంగా కుంభ రాశి వారి జీవితంలో ఎదురవబోయేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును చతాబిషా నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయాలలో దాటితే మీపై ఉన్నటువంటి దోషాలు పూర్తిగా నాశనం అయిపోతాయి. ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆదాయపరంగా ప్రేమ సంబంధాలు వివాహ సంబంధాలు ఇవన్నీ కూడా కుంభరాశి వారికి కలిసొస్తుంది. కుంభ రాశి వారికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులుగా పరిగణించవచ్చు. నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్లినట్లైతే అనుకున్న పనులలో విజయం సాధించుకుంటారు. శని అధిపతిగా ఉన్న కుంభ రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమిది కుంభరాశికి చెందిన వారి జాతకం పై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే శని యొక్క గ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి గురువారం శుక్రవారం కూడా శుభప్రదమే కాబట్టి ఈ రోజుల్లో మీరు ఏదైనా నూతన పనులు ప్రారంభించుకోవచ్చు. నిత్యం శని దేవుని పూజిస్తూ ఉన్నది మీకు అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ఇక ఆహారంలో నల్ల సెనగలు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా మీ యొక్క శని దోషాలు అనేవి తొలగిపోతాయి ..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది