Simha Rasi : జూన్ నెలలో సింహ రాశి వారికి అదృష్టం…!!

Advertisement
Advertisement

Simha Rasi : సింహరాశి జూన్ 2024 : సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రంలో నాలుగవ పాదాలు కుంభ, నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని, ఒకటో పాదంలో జన్మించిన వారిది సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈనెల ఎలా ఉండబోతుంది. జరగబోయే సంఘటనలు ఏమిటి.లాభ నష్ట పలితాలు ఎలా ఉన్నాయి. ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలు గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.. ఈ రాశి వారికి ఈ నెల అదృష్టం తలుపు తట్టే అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో చదువు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు.వీసా సమస్యలు ఏమైనా ఉంటే, అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉన్నది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు సులభంగా పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ బ్యాంకు, వడ్డీ వ్యాపారం చిన్న పాటి ప్రయత్నం కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు. సంపన్నుల కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి ప్రయత్నం కూడా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.ప్రయత్నాలు ఆలోచనలు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి.మొదటి రెండు వారాలు తలచిన కార్యాలు అన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు.బంధుమిత్రుల మధ్య మర్యాద మన్న లను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. కొన్ని సమస్యల నుండి గట్టెకుతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆలోచనపై ఒక అంచనాకు వస్తారు. ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తు తెచ్చుకుంటారు. ఊహించని అవకాశాలు లభిస్తాయి.

Advertisement

వ్యాపారంలో ఆశించని రీతిలో లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పవు. కళాకారులకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ నెల మధ్యలో మానసిక ఆందోళన ఉంటుంది. భూవివాదంలో సమస్యలు అనేవి తొలగిపోతాయి. మీ ఆరోగ్యం పై దృష్టి పెడతారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మొదటి రెండు వారాలలో మీరు మీ తల,కళ్ళు, రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి లేక మీ కుటుంబ సభ్యులతో సమస్యలు ఉండవచ్చు. కానీ వాదనలకు అపార్థాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యమైన పెట్టుబడులు లేక వ్యాపార నిర్ణయాలకు ఇది మంచి సమయం. ఈ నెలలో మీ కెరియర్ పరంగా మంచి ఫలితాలను అందుకుంటారు. విద్యార్థులకు మొదటి రెండు వారాలు కొన్ని సవాలను ఎదుర్కొంటారు. కాని చివరి రెండు వారాలలో పరిస్థితులు మెరుగుపడతాయి. మెరుగైన పలితాలపై దృష్టి సారించి కష్టపడటం చాలా అవసరం.ఈ మాసంలో ఓర్పు పట్టుదల అవసరం. ఇది వృత్తిపరమైన ఎదుగుదలకు అవకాశాలను అందిస్తుంది. ఉద్యోగులకు సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. వారి సహాయంతో మీరు దీర్ఘకాలిక పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు ఈ నెలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు వస్తాయి. వ్యాపారులకు ధన లాభాలు సుగమనం అవుతుంది. అయితే ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సింహ రాశి వారికి ఈ టైంలోగ్రహ సంచారం బాగానే ఉన్నది. అన్ని రంగాల వారు రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి కూడా లోటు ఉండదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. ప్రయాణాలలో కలిసి వస్తాయి. భార్యాభర్తలు మధ్య అవగాహన బాగుంటుంది.

Advertisement

ఖర్చుల తగ్గించండి. కొన్ని విషయాలలో నిందలు పడాల్సి ఉంటుంది. గత కొద్దికాలంగా ఈ రాశి వారు ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా పడుతున్న కష్టాలను తొలగిపోతాయి. మంచి ఉద్యోగానికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ప్రయత్నాలన్నీ సానుకూల పడతాయి. శుభ వార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. విదేశాలలో వృత్తి ఉద్యోగం కోసం అక్కడ స్థిర పడటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేది ఆశించే ఫలితాలను ఇస్తాయి. బందు వర్గాలలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెరుగుతూ ఉంటుంది. సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. అన్ని విషయాలలోనూ పాజిటివ్ గా ఉండటం మంచిది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుండి ఆఫర్లు అందుతాయి. కుటుంబాలలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. దాపత్య జీవితంలో అన్యోన్యత అనేది పెరుగుతుంది. మూడు నాలుగు వారాలలో ఈ రాశి వారికి విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దారుణమైన నిర్ణయాలను తీసుకోవడం మానుకోండి. వాటి గురించి ఫిర్యాదు చేయటానికి బదులు వాటికి పరిష్కారాలను వెతకండి. ఈ నెల మధ్యలో ఒత్తిడి అనేది మమ్మల్ని చుట్టుముడుతుంది. కానీ మీరు దానిని సులభంగా నిర్వర్తిస్తారు. ఈ సమయంలో మీ శత్రువులు బలంగా ఉంటారు. కానీ మీరు కూడా వారి కంటే బలంగా ఉంటారు. నూతన ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావటం వలన శుభ ఫలితాలు అనేవి ఏర్పడతాయి. శ్రమ అధికమైన పట్టుదలతో పని చెయ్యండి. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు లభిస్తాయి. వైవాహ జీవితం లో సమస్యలు తొలగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషం జీవనం అనేది ఆర్థికంగా ఉంటుంది. ఆశించిన మార్పులు ఏర్పడతాయి. సింహరాశి వారి ఈ వృత్తికి సంబంధించి ఈ నెల 16న తర్వాత మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ పనిపై ఎక్కువగా దృష్టి పెడతారు.

Simha Rasi : జూన్ నెలలో సింహ రాశి వారికి అదృష్టం…!!

మెరుగైన ఫలితాలను కనబరుస్తారు. మీ వ్యక్తిగత జీవిత బంధాల మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించటంలో సహాయపడుతుంది. ఈనెల అమావాస్య తర్వాత అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. అదృష్టాలను కూడా మీకు తోడు అవుతుంది. మీరు వ్యాపారస్తులు అయితే మంచి లాభాలతో మీ వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి. పరిస్థితులు మరింత అనుకూలంగా మారతాయి. విద్యార్థులు మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో శాంతి ఆనందం కలుగుతాయి. ప్రశాంతమైన జీవితాన్ని కడుపుతారు. కుటుంబ సభ్యులను ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ప్రోత్సహించుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోతాయి. వ్యాపార రంగానికి సంబంధించిన వారికి ఈ నెల చాలా పవిత్రంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టు లేదా పనిని మొదలుపెట్టేముందు ఆ రంగంలోని అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించటం మంచిది. ఈ నెల మీరు డబ్బు సంపాదించడమే కాకుండా మీ వృత్తిలో ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మొత్తం మీద ఈ నెల సింహ రాశి స్థానికులకు వారి వృత్తి మరియు వృత్తిపరంగా చాలా మంచిది. అయితే మీరు మీ బడ్జెట్ ను బాగా ప్లాన్ చేసుకోవలసి ఉంటుంది. పెట్టుబడులతో పాటు లావాదేవీలను కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. కొన్ని సమయాలలో మీరు ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉన్నది. మీ పెట్టుబడులను ఆచితూచి పెట్టండి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. సంతృప్తికరమైన జీవితాన్ని పొందుతారు. మీ కుటుంబ జీవితం కూడా సానుకూలంగా ఉంటుంది. బంధువులలో కలవటానికి కుటుంబంలో కార్యక్రమాలను హాజరు కావటానికి పాత స్నేహితులు లేక సహోద్యోగులతో తిరిగి కనెక్ట్ కావటానికి అవకాశాలు ఉంటాయి.

మీ జీవిత భాగస్వామి, తోబుట్టువులు వారి వారి రంగాలలో విజయం సాధిస్తారు. ఈ మాసంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దానికి సరైన చికిత్స తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది. విద్యార్థులు పరీక్షలలో రాణిస్తూ కోరుకున్నటువంటి ఫలితాలను పొంది విజయం సాధిస్తారు. అయితే ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి శ్రద్ధ పెట్టండి… వివాహ జీవితంలో సానుకూల పరిణామాలు ఉంటాయి. మంచి జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉండాలి. పెళ్లి సంబంధాలు, నిశ్చితార్థం లేక పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే పనులను చేస్తారు. కొత్త ఇల్లు కొనే అవకాశం కూడా ఉన్నది. మీకు ఎదురయ్యే సవాల్ లను పరిష్కరించడానికి మీ కుటుంబ సభ్యులకు మాట్లాడటం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెల అనేక అంశాలలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగ, వృత్తి,ఆర్థిక,వీదేశీయనం, సంతనం లాంటి విషయాలలో మంచి ప్రయోజనాలను పొందుతారు. వీరికి ఈ నెలలో ఉద్యోగ పరంగా అదృష్టం పట్టే అవకాశం ఉన్నది.ఉద్యోగంలో అధికారం చేపట్టడం.ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావటం నిరుద్యోగులకు ఉద్యోగంలో మంచి అవకాశం కలగటం ఉద్యోగంలో స్థిరత్వం కల్పించటం తప్పకుండా జరుగుతాయి. విదేశీ ఉద్యోగ సంపాదించడానికి వీసా సమస్యలు పరిష్కారం కావటానికి అవకాశం ఉన్నది. కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి.పాటించవలసిన పరిహారాలు ఏమిటి అంటే. సూర్య భగవానుడిని ఆరాధించండి. సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య నారాయణ స్తోత్రాన్ని పాటించండి. అవసరమైన విద్యార్థులకు సహాయం చెయ్యండి. వారికి పుస్తకాలు లేక ఇతర సంబంధిత సామాగ్రిని కొనండి. మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. సమస్యలు తొలగి మంచి ఆరోగ్యం లభిస్తుంది.

Recent Posts

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…

34 minutes ago

Chandrababu : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో అమరావతి రైతుల్లో ఆనందం..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…

2 hours ago

Anil Ravipudi: అనిల్ నెక్స్ట్ చేయబోయేది మన డిప్యూటీ సీఎం తోనేనా ?

Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…

2 hours ago

Vijay : విజయ్ కూడా ఉచితాలపైనే ఆధారపడ్డాడా..?

Vijay  : తమిళనాడు Tamila Nadu Politics  రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…

4 hours ago

Hyundai EV Sector : సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్ తో పనిలేకుండా నడిచే వాహనాన్ని తీసుకరాబోతున్న హ్యుందాయ్..!

Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…

5 hours ago

Indiramma Atmiya Bharosa: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక వారందరీ అకౌంట్లోకి ఏడాదికి రూ.12,000 భరోసా..

Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…

6 hours ago

Hero Electric Splendor EV: హీరో ఎలక్ట్రిక్ స్ప్లెండర్ EV విడుదల.. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల..!

Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్‌(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…

7 hours ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్ రాజకీయ చదరంగంలో ‘సనాతన ధర్మం’ ఒక వ్యూహమా ?

Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…

8 hours ago