Zodiac Signs : ఈ ఐదు రాశుల వాళ్లకి ఏడాది పాటు పట్టిందంతా బంగారమే..!
Zodiac Signs : తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినం నుంచి వచ్చే ఏడు ఉగాది వరకు ఈ ఐదు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే. అయితే ఆ అయిదు రాశులు ఏవి, వారికి ఈ సంవత్సరం అంతా ఎలాంటి లాభాలు కల్గబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. వృశభ రాశి : ఈ రాశి వాళ్లకి గురు భగవానుడు పదో స్థానంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన ఏకాదశంలోకి రాబోతున్నాడు. కాబట్టి వీరికి ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే చక్కటి అవకాశాలు కూడా వచ్చే సూచనలున్నాయి. అదే విధంగా మనం అనుకోని వాటి నుంచి కూడా ఆదాయం రాబోతుంది.
2. కర్కాటక రాశి : ఈ రాశి వాళ్లకి ప్రధాన గ్రహాలైన గురు గ్రహం అష్టమ స్థానం నుంచి నవమ స్థానంలోకి వెళ్తున్నాడు. దీని వల్ ఊహించని వాటి నుంచి లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్ లో పెట్టి మర్చిపోయిన వాటి నుంచి కూడా లాభాలు వస్తాయి. ఆకస్మికంగా ధన లాభం వచ్చి చేరుతుంది.

these five zodaic signs bring more benifits of this telugu year
3. కన్యా రాశి : ఈ రాశి వాళ్లకి ప్రధాన గ్రహాలైన గురు గ్రహం షష్టమ స్థానం నుంచి సప్తమి స్థానంలోకి వస్తున్నాడు. దీని వల్ల భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య అనుబంధం పెంపొందుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలన్నీ తలగిపోతాయి.
4. వృశ్చిక రాశి : ఈ రాశి వాళ్లకి ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల సంతాన కావాలనుకునే వాళ్లు కచ్చితంగా శుభవార్త వింటారు. సమాజంలో పేరు, ప్రఖ్యాతలను పొందుతారు.
5. కుంభ రాశి… ఈ రాశి వాళ్లకి ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల చక్కటి ధన లాభం కల్గే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలన్నింటి నుంచి మీకు లాభాలు వచ్చి చేరుతాయి. మీ చేతి నిండా పుష్కలమైన డబ్బు ఉంటుంది. ఈ ఆయిదు రాశుల వాళ్లకి వచ్చే ఉగాది వరకు పట్టిందల్లా బంగారమే అవుతుంది.
