Green Tea vs Matcha: గ్రీన్ టీ వర్సెస్ మచ్చా టీ.. ఏది ఆరోగ్యానికి మంచిది? ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: February 17, 2026, 7:00 am

Green Tea vs Matcha: ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారిలో ‘గ్రీన్ టీ’ Green Tea ఎప్పుడూ ముందుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ‘మచ్చా టీ’ Matcha Tea కూడా విపరీతంగా ఆదరణ పొందుతోంది. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనది? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ రెండు టీలు ‘కామెల్లియా సినెన్సిస్’ Camellia sinensis అనే మొక్క నుంచే వచ్చినప్పటికీ, వీటిని పండించే విధానం, ప్రాసెస్ చేసే పద్ధతుల్లో తేడా ఉంటుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Green Tea vs Matcha: గ్రీన్ టీ వర్సెస్ మచ్చా టీ.. ఏది ఆరోగ్యానికి మంచిది? ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Green Tea vs Matcha: గ్రీన్ టీ వర్సెస్ మచ్చా టీ.. ఏది ఆరోగ్యానికి మంచిది? ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Green Tea vs Matcha: మచ్చా Matcha అంటే ఏమిటి?

సాధారణ గ్రీన్ టీలా కాకుండా, మచ్చా టీ మొక్కలను కోతకు ముందు సుమారు 20-30 రోజుల పాటు నీడలో Shade-grown పెంచుతారు. దీనివల్ల ఆకులలో క్లోరోఫిల్ Chlorophyll, ఎమినో ఆమ్లాలు Amino Acids స్థాయిలు పెరుగుతాయి. ఆ తర్వాత ఆకులను ఎండబెట్టి, మెత్తటి పొడిలా Powder చేస్తారు. మనం గ్రీన్ టీలో ఆకులను వేడినీటిలో ముంచి తీసేస్తాం, కానీ మచ్చా టీలో ఆకు మొత్తాన్ని పొడి రూపంలో నీటితో కలిపి తాగుతాం. దీనివల్ల ఆకులోని పోషకాలన్నీ 100 శాతం మన శరీరానికి అందుతాయి.

Green Tea vs Matcha: గ్రీన్ టీ, మచ్చా టీ ప్రయోజనాలు Health Benefits

రెండింటిలోనూ యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. మచ్చాలో గ్రీన్ టీ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటాయి. రెండు టీలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.

ఏది బెస్ట్?

ఆరోగ్య పరంగా చూస్తే, మచ్చా కొంచెం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్ గాఢత ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు మచ్చా టీ, దాదాపు 3 కప్పుల సాధారణ గ్రీన్ టీతో సమానం అని నిపుణులు చెబుతుంటారు. అయితే, మచ్చా ధర కాస్త ఎక్కువ, రుచి కొంచెం వగరుగా ఉండవచ్చు.

జాగ్రత్తలు Side Effects

మచ్చాలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రోజుకు 1-2 కప్పులకు మించి తాగకూడదు. ఖాళీ కడుపుతో తాగితే ఎసిడిటీ Acidity సమస్యలు రావచ్చు. గర్భిణీలు, చిన్న పిల్లలు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మీ దినచర్యలో గ్రీన్ టీ లేదా మచ్చా టీని భాగం చేసుకోండి, కానీ అతిగా తాగడం మంచిది కాదని గుర్తుంచుకోండి.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Gudivada Politics : గుడివాడలో అగ్గి రాజుకుంటోంది.. కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి ఖాయమా..?!"

  2. "Dimple Hayathi : శర్వానంద్‌తో పెళ్లి వార్తలపై డింపుల్ హయాతి క్లారిటీ..!"

  3. "Gold Rate Today : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. . నేటి రేట్లివే!"

  4. "Narendra Modi : ఏకంగా ఆ స్థాయికి చేరుకున్న మోదీ.. ఈ లెక్కలు చూస్తే రాహుల్‌కు నిద్ర పట్టదు..!"

  5. "YS Jagan Ys sharmila : తల్లి, చెల్లి రోడ్డుమీద పడటానికి కారణం ఆయనేనట.. యలహంక ప్యాలెస్ రచ్చలో సరికొత్త ట్విస్ట్..!"

  6. "Naga Chaitanya : లోలోపల ఏడవాలనిపిస్తుంది.. కానీ కన్నీళ్లు రావు.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!"

  7. "Miss Universe 2026 Jennifer Barreto : మిస్ యూనివర్స్ 2026 విజేత జెన్నిఫర్ బర్రెటో.. టాప్-12లో చోటు దక్కని భారత్‌..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp