Home » Devotional » These Seven Zodiac Signs Will Get Luck In A Week
Devotional

Zodiac Signs : వారం రోజుల్లో ఈ ఏడు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది… మీది ఏ రాశినో తెలుసుకోండి..

Authored By
aruna
The Telugu News | Published on: September 12, 2022, 7:00 am
Advertisement

Zodiac Signs : గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మరో వారం రోజుల్లో తన రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వెళతారు. దీంతో ఏడు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. వారి జీవితాల్లో అనుకోని మార్పులు జరుగుతాయి. సూర్యుడు సెప్టెంబర్ 17న సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వెళతాడు. ఇలా పరివర్తనం చెందడం వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మేష రాశికి సూర్య సంచార సమయంలో అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. పనిలో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Advertisement

వృషభ రాశి వారు సూర్య సంచార సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్ద నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు రాశి మారిన తర్వాత మిధున రాశి వారికి మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఇష్టమైన వ్యక్తులతో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే కర్కాటక రాశి వారికి సూర్యుడు రాశి మార్పు వలన శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ధన లాభం ఉంటుంది. సింహ రాశి వారికి సూర్య రాశి మార్పు వలన అనుకూలంగా ఉండదు. ఆర్థికపరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

These seven Zodiac Signs will get luck in a week

Advertisement

తులా రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది .సూర్యుడు అనుగ్రహంతో శుభవార్తలు అనుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సూర్యుడు అనుగ్రహం వల్ల ధనస్సు రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కష్టాల నుంచి విముక్తి పొందుతారు. మకర రాశి వారికి కొంత బాధను కలిగిస్తుంది. ఈ సమయంలో వాదనలకు దూరంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో సంబంధాలు చెడిపోవచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుంభరాశికి కొద్దిగా ఆందోళన ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. బాగస్వామి ఆరోగ్యం కారణంగా మానసిక ఒత్తిడి ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీన రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడుల వల్ల లాభాలు వస్తాయి. పెళ్లి సంబంధాలు కుదిరి అవకాశం ఉంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి