Today Horoscope : నవంబర్‌ 28 ఆదివారం ఈరాశి వారికి స్త్రీమూలకంగా ధనలాభాలు వస్తాయి ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Horoscope : నవంబర్‌ 28 ఆదివారం ఈరాశి వారికి స్త్రీమూలకంగా ధనలాభాలు వస్తాయి !

మేషరాశి ఫలాలు : ఈరోజు శ్రమతో పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో కార్యక్రమాలను నిదానంగా చేస్తారు. ప్రయాణాలు కలసిరావు. ప్రతికూలంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. బంధువుల రాకతో బిజీగా గడుపుతారు. అన్ని రంగాల వారికి ఈరోజు శ్రమ తప్పదు. వృషభరాశి ఫలాలు : ఈరోజు నిదానంగా ఆలోచించి పనులు చేయండి. అనుకోని మార్గాలలో ధనం చేతికి అందుతుంది. వ్యాపారాలు ముఖ్యంగా కిరాణం, జనరల్‌ స్టోర్‌ వారికి అనుకున్నంతగా వ్యాపారం జరుగదు కానీ నష్టాలు రావు. ప్రయాణాలకు ఆటంకాలు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 November 2021,10:00 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు శ్రమతో పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో కార్యక్రమాలను నిదానంగా చేస్తారు. ప్రయాణాలు కలసిరావు. ప్రతికూలంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. బంధువుల రాకతో బిజీగా గడుపుతారు. అన్ని రంగాల వారికి ఈరోజు శ్రమ తప్పదు. వృషభరాశి ఫలాలు : ఈరోజు నిదానంగా ఆలోచించి పనులు చేయండి. అనుకోని మార్గాలలో ధనం చేతికి అందుతుంది. వ్యాపారాలు ముఖ్యంగా కిరాణం, జనరల్‌ స్టోర్‌ వారికి అనుకున్నంతగా వ్యాపారం జరుగదు కానీ నష్టాలు రావు. ప్రయాణాలకు ఆటంకాలు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. కార్తీక దామోదర ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : ఈరోజు శుభంగా ఉంటుంది. కార్య జయం కలుగుతుంది. బంధువులు లేదా స్నేహితుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రైతులకు, విద్యార్థులకు, వ్యాపారులకు శుభవార్తలు అందుతాయి. శివుడిని మారేడు దళాలతో అర్చన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో, బయట జరిగే కొన్ని చర్యల వల్ల ఆదాయనికి మించి ఖర్చులుంటాయి. బంధవులతో విభేదాలు కలుగుతాయి. అనుకోని చికాకులు. పనులు నిదానంగా సాగుతాయి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన రోజు. పాత బాకీలు వసూలు అవుతాయి. అనుకోని వైపు నుంచి ధనలాభం వస్తుంది. ఊహించని వారు మిముల్ని కలవడం సంతోషంగా ఉంటుంది.
అన్నిచోట్ల పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారులకు పరిస్థితులు లాభసాటిగా ఉంటాయి. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.ః

కన్యారాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో పరస్పర విరుద్ధ పరిస్థితులు వుంటాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు అన్నిచోట్ల పని భారం బాగా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్త. అన్ని రంగాల వారికి ఈరోజు నిరాశాజనకంగా సాగుతాయి. కాలభైరవాష్టకం పారాయణం చేయడం వల్ల లేదా వినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

తులారాశి ఫలాలు : ఈరోజు అన్ని రకాల పనులలో ఉత్సాహంగా చేస్తారు. ఈరోజు విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ శక్తి, దైర్యంతో పనులను వేగంగా చేస్తారు. పార్టీలకు ఆహ్వానాలు అందుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న బాకీలు వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా జయంగా ఉంటుంది. అన్ని ప్రయత్నాలు సఫలీకృతంగా ఉంటాయి.కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడిగా గడుస్తుంది. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

ధనస్సురాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కుటంబంలో సమస్యలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు రావచ్చు. ఆస్తి వివాదాలు కలుగుతాయి. కార్యాలయాలలో అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. చేసే పనులలో ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారులకు శ్రమించాల్సిన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు విజయాలతో ఆనందంగా ఉంటుంది. సంతోషంతో పనులు పూర్తిచేస్తారు. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్త్రీ మూలకంగా ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. విద్యార్థులకు, వ్యాపారాలకు అవకాశములు లభిస్తాయి. ప్రయాణాలు కలసి వస్తాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. శ్రీ శివాభిషేకం చేయించండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతంగా గడుపుతారు. పేదలకు సహాయం చేసే పనులు చేస్తారు. దీన్ని వల్ల మానసిక ఆనందం పొందుతారు. శుభవార్తలు వింటారు. కుటుంబ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కార్యాలయాలలో పనిచేసేవారికి పదోన్నతులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. శుభాకార్యాలలో పాల్గొంటారు. ఇష్టదేవతరాధన చేయండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది