Zodiac Signs : ఏప్రిల్ 13 బుధవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేష రాశి ఫలాలు : ఈరోజు కష్టం మీద నమ్మకం ఉంచి ముందుకుపోండి. అప్పుల విషయంలో జాగ్రత్త. ధన సంబంధ లావాదేవీలలో జాగురూకత చాలా అవసరమైన రోజు. మీకు కొత్త పరిచయాలు పెరుగుతాయి. గెటూ గెట్‌లకు హజరవుతారు. ప్రేమ విషయంలో సంతోషం. మిత్రులు, బంధవుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : మీ ప్రవర్తన అందరి చేత మన్ననలు పొందుతారు. ధనలాభ సూచన కనిపిస్తుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయం అనుకూలం. మహిళలకు లాభ సూచన. శ్రీ గణపతి ఆరాధన చేయండి…
మిథున రాశి ఫలాలు : చాలా కాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన రోజు. బంధవుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సభలు,సమావేశాలలో మీరు గుర్తింపు పొందుతారు. మహిళలకు చక్కటి శుభ ఫలితాలు. ఇష్టదేవతారాధన, గోసేవ చేయండి.కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మనసులో ఏదో తెలియని వేధ కనిపిస్తుంది. ఒంటరితనంగా భావిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన. పెద్దల పరిచయాలు అవుతాయి. సాయంత్రం నుంచి మంచి ఆలోచనలు చేస్తారు… వైవాహిక జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
సింహ రాశి ఫలాలు : ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన రోజు. ఆదాయం పెరుగుతుంది. గత పెట్టుబడులులో లాభాలు వస్తాయి. పెద్దల వల్ల ప్రయోజనాలు, లాభాలు పొందుతారు… కుటంబ సభ్యుల వల్ల సహయం అందుతుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. శ్రీ హేరంబ గణపతి ఆరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు : ఈరోజు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన సమయం. చెడు వ్యసనాలు, ఆలోచనలకు దూరంగా ఉండండి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు. కుటుంబంలో మార్పులు. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు సంతోషకరమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
తులా రాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. బంధవుల రాకతో సందడి వాతావరణం. దూరప్రాంతం నుంచి అందిన సమాచారం కుటుంబంలో అందరికీ సంతోషాన్నిస్తుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. విద్యా, ఉద్యోగం సాధారణంగా ఉంటుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఆందోళన, మానసిక అశాంతితో ఇబ్బంది పడే రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య సూచన. పిల్లలను నియంత్రణలోప పెట్టడానికి అనువైన రోజు. ప్రేమికుల మధ్య అనవసర అనుమానాలు రావచ్చు. మహిలలకు పని భారం… శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఆవేశం, కోపాన్ని ఈరోజు దూరంగా పెట్టాలి. గతంలో పెట్టుబడులు ఈరోజు మీకు లాభాలను తెస్తాయి. పనులలో జాప్యం కానీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. వృత్తి పరమైన అభివృద్ధి కనిపిస్తుంది. వివాహం అయిన వారికి సంతోషకరమైన రోజు. శ్రీ సుబ్రమణ్య భుజంగాన్ని వినండి లేదా చదవండి.
మకర రాశి ఫలాలు : మీ కోరికలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో కొంచెం పురోగతి కనిపిస్తుంది. మిత్రులు లేదా బంధవులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా నోరు పారేసుకోకండి. బంధువుల ద్వారా శుభవార్తలను వింటారు. ప్రేమికులకు సంతోషకరమైన రోజు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు… మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ఆనందంగా ఈరోజు గడుపుతారు. ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. బంగారు, ఆభరణాలు కొనుగోలుకు అవకాశం కనిపిస్తుంది. మిత్రుల వల్ల ప్రయోజనాలు పొందుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు కమిట్‌మెంటతో పని చేయండి… అప్పులు తీరుస్తారు. ఆనందంగా గడపటానికి ప్రయత్నిస్తారు. మనఃశాంతి దొరుకుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు లాభదాయకమైన రోజు.
ఇష్టదేవతారాధన చేయండి.