Zodiac Signs : ఏప్రిల్ 17 ఆదివారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. అనుకోని చోట నుంచి ఆదాయం వస్తుంది. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అన్నదమ్ముల నుంచి సహకారం. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని ఆటంకాలతో పనులు వాయిదా. కుటుంబంలో సమస్యలు రావచ్చు. వ్యవసాయం, వ్యాపారం, విద్యా వంటి విషయాలలో కొంత ఇబ్బంది రావచ్చు. అనుకోని ప్రయాణాలు. శివారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : కొంత మంచి , కొంత చెడు ఫలితాలతో ఈరోజు సాగుతుంది. అనుకోని ఖర్చులు, ఆర్థిక మందగమనం. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.కర్కాటకరాశి ఫలాలు : మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. అప్పులు తీరుస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. పెద్దల ద్వారా కీలక సమాచారం అందుతుంది. ఇష్టదేవతరాధన చేయండి.
సింహరాశి ఫలాలు ; మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు. అనుకోని అప్పులు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది. మనస్సు స్థిరంగా ఉండదు. బంధువుల నుంచి ఒత్తిడులు.శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని లాభాలు వస్తాయి. వస్త్రలాభాలు. దూర ప్రయాణ సూచన. మహిళలకు ధనలాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. ఆర్థిక మందగమనం. అనుకోని ఖర్చులు. బంధువులద్వారా ఇబ్బందులు. విందులు, వినోదాలకు హాజరు. సమయం వృథా చేస్తారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అన్ని పనులు సమయానికి పూర్తిచేస్తారు. ధన విషయంలో పురోగతి కనిపస్తుంది. బంధు మిత్రల సమాగమం. అనుకోని వారితో ప్రయోజనాలు పొందుతారు. ఇష్టదేవతరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : పిల్లల ద్వారా శుభ వార్తలు వింటారు. అనుకోని ఖర్చులు.ప్రయాణాలు. అరోగ్యం జాగ్రత్త. అప్పులు తీరుస్తారు. పని బారం పెరిగి అలసి పోతారు. విందులు, వినోదాలకు హాజరు. మహిళలకు అనుకోని శుభవార్తలు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఆటంకాలతో విసిగి పోతారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని ఖర్చులు., ఆదాయం వస్తుంది కానీ తృప్తి వుండదు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు ; మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. అప్పులు తీరుస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వస్తుంది. విద్యా, వ్యాపారం అనుకూలం. మహిలలకు మంచిరోజు. శ్రీ శివార్చన చేయండి.
మీనరాశి ఫలాలు : మీరు చేయాల్సిన పనులు పూర్తి చేస్తారు. అదాయం వృధ్ధి అవుతుంది. వ్యాపారం సాఫీగా సాగుతుంది. కుటుంబ వ్యవహారాలు సాఫీగా,సంతోషంగా సాగుతాయి. విద్యార్థులకు మంచి రోజు. రియల్ పెట్టుబడులకు అనుకూలం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.