Home » Devotional » Today Horoscope April 28 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఏప్రిల్‌ 28 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Devotional Desk
The Telugu News | Updated on: April 28, 2022, 1:38 am
Advertisement

Zodiac Signs మేషరాశి ఫలాలు : మీరు చేసే పనులపై మరింత శ్రద్ధ పెడుతారు. కుంటుంబంలో సానుకూలమైన మార్పులు జరుగుతాయి. అనుకోని చోట నుంచి శుభ వార్తలు వింటారు. విద్యా, ఉద్యోగ విషయాలలో మంచి మార్పులు జరుగుతాయి.నవగ్రహారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : చక్కటి శుభ సమయం. అనుకోని మార్పులు జరుగుతాయి. అప్పులు తీరుస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. తల్లి తరపు వారి నుంచి శుభవార్తలు. మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కదు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి.

కర్కాటకరాశి ఫలాలు : చేసే పనులలో జాగ్రత్త అవసరమైన రోజు. కష్టపడితేనే విజయం సాధించే రోజు. ఎవరి మీద ఆధారపడ వద్దు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అనుకోని వారి నుంచి ఇబ్బంది వచ్చినా మిత్రుల ద్వారా వాటి నుంచి గట్టెక్కుతారు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Advertisement

today horoscope april 28 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : శుభదినం. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. అనుకోని లాభాలు రావచ్చు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. సంతానం యోగం. వివాహం కాని వారికి అనుకూలమైన సంబంధాల వస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Advertisement

కన్యరాశి ఫలాలు : ధైర్యంతో ముందుకు పోవాల్సి న రోజు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగుంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. దూర ప్రాంతాల నుంచి మంచి వార్తలు వింటారు. విదేశీ యానం అనుకూలమైన సమయం. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అనుకోన్న దానికంటే ఎక్కువ ఆదాయం ఈరోజు వస్తుంది. అప్పులు తీరుస్తారు. వాహనాలను, ప్లాట్లును కొనుగోలు కొంటారు.మహిళలకు శుభవార్తలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక మందగమనం. అనుకోని వారి నుంచి ఇబ్బంది. సాయంత్రం నుంచి కొంచెం శుభ పరిణామాలు జరుగుతాయి. ఇంటా, బయటా కొంత వత్తిడి పెరుగుతుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : పెద్దల ద్వారా మంచి వార్తలు వింటారు. అన్ని రకాల వ్యాపారాలకు అనుకూలమైన రోజు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

మకరరాశి ఫలాలు : ధనం కోసం ఈరోజు కొంత కష్టపడి పోతారు. అనుకూలమైన రోజు. కష్టపడి మంచి ఫలితాలను సాధిస్తారు. విద్యా, ఉద్యోగులకు అనుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటా, బయటా అనుకోని మార్పులు జరుగుతాయి. కుటుంబంలో చక్కటి వాతావరణవం. ప్రయాణ సూచన. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీకు శుభ సమయం ఈరోజు. భార్య/ భర్త తరపు వారి నుంచి లాభాలు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. మహిళలకు స్వర్ణ లాభాలు.ఇష్టదేవతరాధన చేయండి.

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి