Zodiac Signs : ఆగస్టు 13 శ‌నివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By aruna | The Telugu News | Updated on : 12 August 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు సానుకూలమైన రోజు. అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. విదేశాలు లేదా దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. పెద్దలు లేదా కీలకమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. మహిళలకు సానుకూలమైన రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు చాలాకాలం నుంచి ఎదురుకుంటున్నసమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపారాలలో చికాకులు తొలిగిపోతాయి. కొత్త విద్యా ఉద్యోగ అవకాశాలు. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. పెద్దల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వాహన సౌఖ్యం. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. ప్రయాణ సూచన. కీలక నిర్ణయాలను వాయిదా వేయండి. అప్పులు తీసుకోకపోవడం ఈరోజు చాలా ముఖ్యం. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. శ్రీ ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి మంచి జరుగుతుంది.

Today Horoscope August 13 2022 Check Your Zodiac Signs

Today Horoscope August 13 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : కొద్దిగా సుఖం, కొద్దిగా కష్టంతో కూడిన రోజు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు.
చికాకులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ధనం విషయంలో జాగ్రత్త అవసరం.
కీలక నిర్ణయాలలో పెద్దల సలహాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పై అధికారుల నుండి ప్రశంసలు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

కన్య రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. అన్ని రకాలుగా బాగుంటుంది ఈరోజు. విద్యా, ఆర్థిక విషయాలలో చక్కటి ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటారు. ఈరోజు మీకు గృహ వాహన యోగాలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు కష్టపడాల్సిన రోజు. విద్యా, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మీరుచేసిన పనికి ఫలితం కష్టమే. వాహనాల నడిపేటప్పుడు జాగ్రత్త. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం . శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త పెట్టుబడులకు ఈరోజు అవకాశం ఉంది. అయితే కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.
ఉద్యోగులకు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతుంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ధైర్యంతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సానుకూల మార్పులు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. గతంలో వచ్చిన వివాదాలు పరిష్కరించుకుంటారు. పెట్టుబడుల గురించి చేసే ఆలోచనలు ఫలిస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మంచి విషయాలను ఈరోజు తెలుసుకుంటారు. పనులలో వేగం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావారణం. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : అన్నింటా ప్రతికూల ఫలితాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకు అవకాశం లేదు. వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. పిల్లల వల్ల చికాకులు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీ లక్ష్మీదేవిని మందారం లేదా గులాబీలతో ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : అన్ని విషయాలలో పురోగతి కనిపిస్తుంది. పనులను సకాలంలో పూర్తిచేస్తారు. స్నేహితుల ద్వారా లాభాలను గడిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. తెలివితేటలతో ముందుకు పోతారు. కొత్త వాహనాలను కొంటారు. ధనలాభాలను పొందుతారు. శ్రీ వేంకటేశ్వస్వామి ఆరాధన చేయండి.

Advertisement

aruna

No bio available for this author.

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి