Home » Devotional » Today Horoscope August 16 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఆగస్టు 16 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
aruna
The Telugu News | Published on: August 15, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : అన్ని రంగాల వారికి సానుకూలమైన ఫలితాలు వస్తాయి. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వివాదాలు దూరంగా ఉండండి. మహిళలకు మంచి రోజు. దూర ప్రాంత ప్రయాణాలకు అవకాశం ఉంది. శ్రీ కుజగ్రహారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో ఆదరణ పొందుతారు. ఇంట్లో, బయటా అనుకూలమైన వాతావరణం. శ్రీ హనుమాన్‌ చాలీసా ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ఇబ్బంది పడుతారు. ఆర్థికంగా మందగమనం. ఖర్చులు పెరుగుతాయి. అన్ని విషయాలలో ప్రతికూలత కనిపిస్తుంది. పనులలో జాప్యం పెరుగుతుంది. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త. మహిళలకు దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు వింటారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పెద్దల నుంచి మంచి సహాయ సహకారాలు పొందుతారు. అప్పుల నుంచి బయటపడటానికి విముక్తి పడుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ అవసరాలకు డబ్బు అందుతుంది. చికాకులు తొలగుతాయి. మహిలలకు లాభదాయకమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope August 16 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : మీరు శుభకార్యలు చేయాలని ఆలోచిస్తారు. ఆదాయం పెరగుతుంది. ఈరోజు ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. మిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఆరోగ్యం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అమ్మ తరపు వారి నుంచి లాభాలు. శ్రీ ఆంజనేయస్వామి దండకం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా శుభ, అశుభ ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం కోసం ఆహార నియమాలను తప్పక పాటించాలి. ధనం కోసం బాగా శ్రమించాల్సి వస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం . సాయంత్రం నుంచి కొన్ని సానుకూల ఫలితాలు వస్తాయి. శ్రీ దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అనుకున్న దానికంటే ఈరోజు బాగుంటుంది. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడుతారు. ఇంటా, బయటా అనుకూలమైన వాతావరణం. వ్యాపారాలో లాభాలు. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. ఈరోజు దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు విలువైన వస్తువులను కొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా కష్టపడుతారు కానీ లాభాలను గడిస్తారు. విదేశీ విద్య సంబంధించిన ప్రయత్నాలు పలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మహిళలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాల సాధిస్తారు. ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. ఇంటా, బయటా అనుకూలంగా ఉంటుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో ఈరోజు గడుస్తుంది. ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. విద్యా, ఉపాది విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. మీరు చేసే పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. ఆదాయం మించిన ఖర్చులు వస్తాయి. అనుకోని నష్టాలు రావచ్చు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కానీ అదిక ధరలను పెడుతారు. అనారోగ్య సమస్య రావచ్చు జాగ్రత్త. కొత్త పనులను ప్రారంభించడానికి మంచి రోజు కాదు. తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయండి. నవగ్రహ ప్రదక్షణలు, గోసేవ చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. అన్నింటా శుభకరమైన వాతావరణం. ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వివాహ, విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మహిళలకు ధనలాభాలు. దుర్గా మాత ఆరాధన చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి