Home » Devotional » Today Horoscope August 25 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఆగస్టు 25 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
aruna
The Telugu News | Published on: August 24, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : ఈరోజు ఆనందంగా గడుపటానికి ప్లాన్‌ చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అన్ని విషయాలలో చికాకులు తగ్గి సానుకూలత పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. కానీ దైర్యంతోవాటిని అధిగమిస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోనే ముందు కొంచెం ఆలోచించి తీసుకోండి. పెట్టుబడులకు అవకాశం ఉంది. ఇంటా, బయటా మీకు ఒత్తిడి తగ్గుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

మిధున రాశి ఫలాలు : ఈరోజు చికాకులు వస్తాయి. ఆదాయం కోసం బాగా శ్రమించాల్సి న రోజు. రుణ ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఆందోళనతో కూడిన రోజు. విద్యార్థులు బాగా కష్టపడాలి. అనారోగ్య సమస్య మిముల్ని వేధిస్తుంది. శ్రీ లలితాదేవి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. అన్నింటా మీరు జయం సాధిస్తారు. భవిష్యత్‌ కోసం పొదుపును ఈ రోజు ప్రారంభిస్తారు. ప్రేమికులకు చక్కటి రోజు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆఫీస్‌లో చక్కటి శుభదినం. శ్రీ విష్ణు ఆరాధన చేయండి.

Today Horoscope August 25 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : ఈరోజు నిరుద్యోగులకు శుభదినం. అన్నింటా సానుకూలత పెరుగుతుంది. విద్యా, ఉపాధి, ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. అమ్మతరపు వారి నుంచి ప్రయోజనాలు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : చాలా కాలంగా పెండింగ్‌ విషయాలు పరిష్కారం అవుతాయి. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అన్నింటా మీకు శుభకరంగా ఉంటుంది. విద్యా, ఉపాధి విషయాలు మెరుగుపడుతాయి. మహిలలకు మంచి లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Advertisement

తుల రాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం చెడు కలిగిన రోజు. ఆర్థికంగా ఇబ్బంది పడినా చివరరకు సమస్య నుంచి గట్టెక్కుతారు. పెండింగ్‌ పనులు వాయిదా పడుతాయి. ఆదాయం కొంచెం పెరుగుతుంది. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఇష్టదేవతారధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. ఆదాయం కోసం కష్టపడాల్సి న రోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు వస్తాయి. పిల్లల వల్ల మీకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణ సూచన. అన్నింటా లాభకరంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి అష్టోతరంతో పూజ చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలత కొంత ఉంటుంది. అన్నింటా ఆటంకాలు వస్తాయి. విద్యా, ఉపాధి విషయాలలో శ్రమ బాగా పెరుగులి. పని మీదనే శ్రద్ధ పెట్టాలి. వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ఖర్చులు పెరగుతాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. శ్రీ కుబేర ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే పనులలో వేగంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. మంచి ఆలోచనలు చేస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. అన్నింటా మీరు మంచి ఫలితాలను సాధిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ఈరాశి వారు మంచి విజయాలను సాధిస్తారు ఈరోజు. పెద్దల నుంచి సహయసహకారాలు అందుతాయి. విద్యార్థులకు శుభ ఫలితాలు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. మహిలలకు ధనలాభాలు అందుతాయి. శ్రీ గురుచరిత్ర పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు అనారోగ్య సూచన కనిపిస్తుంది. అన్నింటా మీకు ఇబ్బందులు వస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. వృత్తి విషయంలో మంచి జరుగుతుంది. అన్నింటా పర్వాలేదు అనేలా రోజు గడుస్తుంది. శ్రీ కాలభైరావారాధన చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి