Zodiac Signs : ఆగస్టు 8 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఆగస్టు 8 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By aruna | The Telugu News | Updated on :7 August 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : చక్కటి రోజు ఈరోజు. అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ చేయాలి. ఆదాయం తగ్గుతుంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. శ్రీ సోమశేఖర స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం కోసం తీవ్రంగా కస్టపడుతారు. అనుకున్న సమయానికి ధనం చేతికి అందుతుంది. అన్నదమ్ముల నుంచి మంచి సహకారం అందుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ లక్ష్మీ అష్టోతరంతో దేవుడికి పూజ చేయండి.

మిథున రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడుతారు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు రావచ్చు. అనుకున్న సమయానికి ధనం చేతికి రాక బాదపడుతారు. నిరుద్యోగులు బాగా కష్టపడాలి. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ లలితా దేవి సహస్రనామాలను పారాయణ చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అన్నింటా ఆశాజనకమైన ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. కోర్టు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope August 8 2022 Check Your Zodiac Signs

Today Horoscope August 8 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు :కొద్దిగా శ్రమచేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయం తగ్గినా సమయానికి అవసరమైన ధనం చేతికి అందుతుంది. వ్యవహారాలలో సానుకూలమైన ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు లాభాలు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరమైన రోజు. పనులలో జాప్యం పెరుగుతుంది. ఆర్థికంగా మందగమన స్తితి. చెడు వార్తలు వింటారు. సాయత్రం నుంచి ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బంది రావచ్చు. శ్రీ మల్లికార్జున స్వామి ఆరాదన చేయండి.

తులారాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం మంచిగా వస్తుంది. పనులు సాఫీగా సాగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు సాధిస్తారు. అనారోగ్యం నుంచి విముక్తి. మహిళలకు మంచిరోజు. శ్రీ రుద్రపారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు అవకాశం లేదు. మంచి చేద్దామనుకుంఏ ఈకు ఈరోజు ఇబ్బందులు వస్తాయి. శ్రీ లక్ష్మీ,కుబేర ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మీకు ఇష్టమైన వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆర్థిక విషయాలలో చక్కటి సానుకూలమైన ఫలితాలు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మహిలలకు మంచిరోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : అన్ని వ్యవహారాలలో అనుకూలత. సమాజంలో గౌరవం. కుటుంబంవలో మంచి విలువ ఇస్తారు. మార్పులు జరుగుతాయి. ఆఫీస్‌లో మీరు పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార వృద్ధి. శివాలయంలో దీపారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొత్త అవకాశలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : మంచి పనులు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది. కానీ సమయానికి మాత్రం ధనం చేతికి అందుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది