Zodiac Signs : డిసెంబర్ 10 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 9 December 2021, 10:40 pm

Zodiac Signs మేషరాశి ఫలాలు : ఈరోజు సంతోషకరమైన రోజు. వస్తు లాభం, ధన లాభం కలుగుతుంది. పాలు, కూరగాయ వ్యాపారులకు లాభాలు బాగా వస్తాయి. అన్ని పనులు వేగంగా పూర్తిచేస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమా మిశ్రంగా ఉంటుంది. అనుకోని అవాంతరాలతో రోజు గడస్తుంది. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. మీకు దగ్గరి వారి నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రేమికులకు మంచిరోజు. అనుకోని ప్రయాణాలు. శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీదేవిని గులాబీలు లేదా మందారాలతో పూజించండి.

Zodiac Signs మిధునరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆఫీస్‌లో కొన్నిసమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపంతో ఇబ్బందులు తలెత్తుతాయి. ధనం సరైన సమయానికి చేతికి అందదు. ఇబ్బందులు పడుతారు,. శ్రీ శివ పూజ చేయండి. కర్కాటకరాశి ఫలాలు : సంతోషకరమైన వార్తలు. అన్నింటా జయం. కుటుంబంలో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. పెద్దల నుంచి సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులకు పురోభివృద్ధి. అనుకూలమైన ఫలితాల కోసం గణపతి ఆరాధన చేయండి.

today horoscope december 10 2021 check your zodiac signs

today horoscope december 10 2021 check your zodiac signs

Zodiac Signs సింహరాశి ఫలాలు : ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని చోట నుంచి ధనలాభాలు. వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు పెద్దగా లాభాల రావు. అప్పులు చేయాల్సిన పరిస్థితి. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసి అష్టోతరం చదువుకోండి మంచి ఫలితాలు వస్తాయి.

Zodiac Signs తులారాశి ఫలాలు : ఈరోజు మనసు స్థిరంగా ఉండదు. చేసే పనులపై ధ్యాస పెట్టలేరు. కుటుంబంలో వత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొత్త సమస్యలు. శుభ ఫలితాల నవగ్రహాల దగ్గర ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మీకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో పెద్ద వ్యక్తుల సహకారం లభిస్తుంది. అందరితీ సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలు, చిల్లర, కిరాణా, రియల్‌ ఎస్టేట్‌ వారికి మంచి లాభాలు వస్తాయి. కుటంబంలో ముఖ్య నిర్ణయాలు. తీసుకోంటారు. ఇష్టదేవతారధన చేసుకోండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బంది, కొంచెం అనుకూలం కనిపిస్తుంది. వాతావరణంలో మార్పులతో శరీరంలో అనారోగ్య సూచనలు. గతంలో తీసుకున్న అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధనం అనుకున్నంనత లేకపోవడంతో ఇబ్బందులు రావచ్చు. పెద్దల సహకారంతో ముందుకుపోతారు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Zodiac Signs మకరరాశి ఫలాలు : ఈరోజు మంచి వార్తలు వింటారు. స్వర్ణ ఆభరణాలు కొనుగోలకు ప్రయత్నాలు చేస్తారు. పెద్దల పరిచయాలు, సహకారం అందుతుంది.
క్షేత్రాలను దర్శించడానికి ప్రయత్నిస్తారు. అన్ని రంగాల వారికి ఈరోజు ప్రోత్సాహంగా ఉంటుంది. శివపంచాక్షరీ జపం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి.

కుంభరాశి ఫలాలు : ఆర్థిక పరిస్థితులు నిరాశజనకంగా ఉంటాయి. అప్పులు చేయకండి. అప్పులు ఎవరికి ఇవ్వకండి. ముఖ్య పనులు వాయిదా పడుతాయి. ఆరోగ్యభంగం. నిరాశ, నిస్పృహలతో రోజు గడుస్తుంది. కాని సాయంత్రానికి పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు దగ్గరి వారి నుంచి మంచి వార్తలు, శుభ వార్తలు వింటారు. అన్నింటా విజయం, సంతోషంతో గడుపుతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మంచిరోజు. మరింత అనుకూలత కోసం శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Rainy Season Vegetables : వర్షాకాలంలో ఈ 4 కూరగాయలు తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే..!"

  2. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  3. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  4. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  5. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  6. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  7. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి