Vastu Shastra : ఈ టిప్స్ ఫాలో అయితే ఇంట్లో ఫుల్ పాజిటివ్ ఎనర్జీ..
Vastu Shastra : ఇంటిలో సానుకూల పవనాలు లేనట్లయితే వారు ఏ పని చేయాలనుకున్నప్పటికీ అది పూర్తి కాదని పెద్దలు చెప్తుంటారు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి లోపల సానుకూల పవనాల వీయాలంటే ఈ టిప్స్ ఫాలో కావాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ టిప్స్ ఫాలో అయినట్లయితే ఇంటి లోపలి నుంచి పూర్గి నెగెటివిటీ బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది.జనరల్‌గా చాలా మంది తమ ఇంటిలో ఉండేటువంటి గడియారాలు పని చేస్తున్నాయో లేదో చూస్తుంటారు. అయితే, అందులో ఉండే సెల్ పని చేయకపోవడం వల్లనో లేదా ఆ వాచ్ పాడైపోయినట్లయితే వాటిని అలా వదిలేస్తుంటారు
. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం అలా అస్సలు చేయొద్దట. వాచ్ ఎప్పుడూ వర్కింగ్ కండీషన్‌లోనే ఉండేలా జాగ్రత్త పడాలి. పని చేయని వాచ్‌ను ఇంటి నుంచి తొలగించాలి. హౌస్‌లో ఈస్ట్, నార్త్, పడమ దిక్కుల్లో ఉన్న గోడలకు మాత్రమే గడియారాలను బిగించాలి. ఇకపోతే గ్రీన్ కలర్ వాల్ వాచెస్‌ను ఇంటి లోపల పెట్టుకోకూడదు. వేరే కలర్ వాచెస్ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు.ఇంటి బయట ఉండేటువంటి ఇంటికి సంబంధించిన నేమ్ ప్లేట్ ఎప్పుడూ క్లీన్‌గా ఉండాలి. అలా నీట్‌గా క్లీన్‌గా ఉంటేనే ఆ ఇంట్లో పాజిటివ్‌నెస్ ఉంటుంది.
Vastu Shastra : ఈ విషయాల్లో జాగ్రత్తలు ముఖ్యం..
హౌస్ లోపల ప్లాస్టిక ఫర్నిచర్ ఉండకుండే జాగ్రత్త పడాలి. చెక్క ఫర్నిచర్ ఉంటే పర్వాలేదు. మెటల్ ఫర్నిచర్ కూడా అస్సలు లేకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మెటల్ ఫర్నిచర్ ఉంటే హౌస్ లోపల ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. దక్షిణ, పడమర గోడల వెంట హెవీ ఫర్నిచర్ ఉంచాలి. లైట్ వెయిట్ ఫర్నిచర్‌ను నార్త్, ఈస్ట్ వాల్స్ వద్ద మాత్రమే ఉంచాలి. హౌస్ ఎంట్రీ పాయింట్ వద్ద కంపల్సరీగా తులసి మొక్కను నాటాలి. అలా చేయడం వల్ల ఇంటిలోని పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇకపోతే హౌస్ ఎంట్రీ పాయింట్ వద్ద షూ స్టాండ్‌ను అస్సలు పెట్టొద్దు. అలా చేయడం వలన ఇంటిలోనికి నెగెటివ్ ఎనర్జీ ఎంటరయ్యే చాన్సెస్ ఉంటాయి.