From 17th August all these four zodiac signs need is gold
మేషరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా శుభ ఫలితాలు వస్తాయి. ఇంటా, బయటా సంతోషకరమైన వాతావరణం. వేగంగా పనులు పూర్తిచేస్తారు. చాలా కాలం తర్వాత విశ్రాంతి దొరుకుతుంది. వ్యాపారాలలో మరింత లాభాలు. శుభ ఫలితాల కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర దీపారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ఏ పనిచేసినా శ్రద్ధతో చేయకుంటే ఇబ్బందులు రావచ్చు. కార్యాలయాల్లో పనిచేసేవారికి తోటి వారితో ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. స్నేహితులతో వివాదాలు వచచ్చు. విద్యార్థులు, వ్యాపారులు ఈరోజు కష్టపడ్డా ఫలితం ఉండదు. అనారోగ్య సూచన. శుభ ఫలితాల కోసం శ్రీవిష్ణు సహస్ర నామాలను పారాయణం చేయండి.
మిధునరాశి ఫలాలు : ఈరోజు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. అనుకోని పరిస్థితులలో ప్రయాణాలను చివరి నిమిషంలో వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి అనుకూల ఫలితాల కోసం నవగ్రహారాధనతోపాటు ఆంజనేయస్వామి దేవాలయంకు వెళ్లండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. పెద్దల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వస్త్రలాభాలు. కొన్ని పనులు మాత్రం చాలా నిదానంగా నడుస్తాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు కొంత అంసతృప్తి కలుగుతుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీరామ తారకాన్ని జపించండి.
Today Horoscope December 11 2021 check your zodiac signs
సింహరాశి ఫలాలు : ఈరోజు పాత బకాయిలు వసూలు అవుతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో సానుకూలత. శుభ ఫలితాల కొరకు శ్రీదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్త. ధనం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. కిరాణం, రియల్ ఎస్టేట్ వారు కొత్త వ్యాపారాలకు ఈరోజు పోకండి. ఆఫీస్‌లో పనులు చికాకు పరుస్తాయి. శుభఫలితాల కోసం గణపతికి పూజ చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు మనసు స్థిరంగా ఉండదు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.ఈ రోజు ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు. వ్యాపారాలలో, ఉద్యోగాలలో అనుకోని మార్పులు జరుగవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి వజ్రకవచాన్ని కనీసం 3 సార్లు చదవండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు చాలాకాలంగా ఉన్న ఆర్థిక బాధలు తీరుతాయి. దగ్గరి వారి నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొంటారు. పెద్దల సలహాలతో ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలలో కొత్త ఆశలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు కొంత నిరాశకలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితులు బాగుండవు. వ్యాపారాలలో లాభాలు రావు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసర విషయాలలో తలదూర్చకండి. ప్రేమికులకు కొంచెం కష్టమైన రోజు. శుభ ఫలితాల కొరకు శ్రీ శివపంచాక్షరీ జపం చేయండి.
మకరరాశి ఫలాలు : ఈ రోజు శుభవార్తలు వింటారు. అంతేకాకుండా శుభకార్యాలకు హాజరవుతారు. బంగారు లేదా గృహోపకరణాలు వస్తువులు కొంటారు. ప్రియురాలుతో సఖ్యత. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆఫీస్‌లో ఊహించిన మార్పులు. వ్యాపారాలకు అనుకూలమైన లాభాలు. ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబంలో అనుకోని మార్పులు, వివాదాలకు అవకాశం ఉంది. కుటుంబంలో పరిస్థితులు స్థిరంగా ఉండవు. ఇంటి పక్కవారితో అనుకోని వివాదాలు. శుభ ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. మంచి లాభాలు గడిస్తారు. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పాత స్నేహితులు కలయిక. వాహనయోగం. ఇంటా, బయటా ఊహించని మార్పులు. అనుకూలమైన ఫలితాల కొరకు శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర దీపారాధన చేయండి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.