Zodiac Signs : డిసెంబర్ 15 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : డిసెంబర్ 15 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

మేష రాశి ఫలాలు : కొద్దిగా ఓపికతో వ్యవహరించాల్సిన రోజు. ఆదాయంలో సాధారణ పరిస్థితి. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. మిత్రులతో మనస్పర్ధలు రావచ్చు. వ్యాపారాలలో పరిస్థితులలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. చేసే పనులలో జాప్యం జరిగినా చివరకు పూర్తిచేస్తారు. అనుకోని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 December 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : కొద్దిగా ఓపికతో వ్యవహరించాల్సిన రోజు. ఆదాయంలో సాధారణ పరిస్థితి. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. మిత్రులతో మనస్పర్ధలు రావచ్చు. వ్యాపారాలలో పరిస్థితులలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. చేసే పనులలో జాప్యం జరిగినా చివరకు పూర్తిచేస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. విద్యా, వృత్తుల వారికి అనుకూలమైన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలకు ధనలాభాలు రావచ్చు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని వారి నుంచి లాభాలు కలుగుతాయి. చేసే పనులు వేగంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలలో చికాకులు వస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాల యందు స్వల్ప ధనలాభాలు. మహిళలకు ధనలాభాలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. శ్రమ అధికమైన పనులు మాత్రం సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మహిళలకు చక్కటి రోజు. కొత్త పనలు ప్రారంభిస్తారు. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.

Today Horoscope December 15 2022 Check Your Zodiac Signs

Today Horoscope December 15 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : కొద్దిగా మధ్యస్తంగా ఉంటుంది. అనుకోని ధనలాభాలు రావచ్చు. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలత కనిపించదు. ఓపికతో పనులు పూర్తిచేయాలి. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో మనస్పర్థలు వస్తాయి జాగ్రత్త. సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : మంచి శుభఫలితాలు వస్తాయి. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆఫీస్‌లో పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇంటా, బయటా మీకు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రయాణాలు వల్ల లాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు కనిపిస్తున్నాయి. విద్యా విషయంలో ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. చేసే పనులలో ఇబ్బందులు వస్తాయి.
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. మహిళలకు చక్కటి శుభవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. అమ్మతరపు వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. ఇంట్లో మీకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఆఫీస్‌లో పరిస్థితులు అంత అనుకూలత కనిపించట్లేదు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు వస్తాయి. కొద్దిగా శ్రమతో కూడిన రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. కోపతాపాలతో ఇబ్బందులు రావచ్చు. విద్యార్థులకు పట్టుదల అవసరమైన రోజు. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి వత్తిడి పెరగుతుంది. చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. మహిలలకు పని బారం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు మీరు చక్కటి శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆదయంలో వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలలో మంచి వృద్ధి. ఆనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. అన్ని రకాల వృత్తుల వారికి చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ నారసింహ ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. చేసే పనులపై శ్రద్ధ పెడితేనే అవి పూర్తివుతాయి. కొన్ని ఆనుకోని ఆటంకాలతో కొద్దిగా చికాకుగా ఉండే రోజు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారాలలో చిన్న చిన్న ఇబ్బందులు. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపారలలో లాభాలు. ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూల కనిపిస్తున్నాయి. ఇంటా, బయటా అనుకూలత కనిపిస్తున్నాయి. ఆఫీస్‌లో పై అధికారుల సఖ్యత కనిపిస్తున్నాయి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది