Zodiac Signs : డిసెంబర్ 2 గురువారం ఈరాశి వారికి ఆర్థిక ఇబ్బందులతో మిత్రుల దగ్గర చేయి చాపాల్సి రావచ్చు !

Advertisement
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు మంచి రోజు. అనుకోని అవకాశాలు వస్తాయి. మీ తెలివితేటలు మీ పక్క వారు గుర్తిస్తారు. సమాజంలో గౌరవం. కొత్త వస్తువులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, లాభాల బాటలో సాగుతాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం చదవండి.వృషభరాశి ఫలాలు : ఈరోజు పనులలో మందగమనం కనిపిస్తుంది. ఆఫీస్‌లో, ఇంట్లో పని వత్తిడి బాగా పెరరుగుతుంది. ఆర్థికంగా సాధారణ స్తితి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అరోగ్యం జాగ్రత్త.ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉండవచ్చు. శుభ ఫలితాల కొరకు శ్రీ విష్ణు సహస్ర నామాలను చదువండి.

Advertisement

మిధునరాశి : ఈరోజు మంచి, కొంచెం చెడుతో గడిసిపోతుంది. ఆర్థిక మందగమనం. కానీ చిల్లర, కిరాణ వ్యాపారులకు లాభాలు వస్తాయి. కుటుంబంలో పెద్దలతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. విద్యార్థులకు, ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవి దగ్గర దీపారాధన, మందారపూలతో అర్చన చేయండి.కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ఆప్పుల బాధలు తీరుతాయి. ఆఫీస్‌లో కీలక సమాచారం. విందువినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. బంధవుల రాకతో ఇంట్లో సందడి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

today horoscope december 2 2021 check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో పనులు ముందుకు సాగవు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. వ్యాపారాలు చిక్కులు. అన్ని రంగాల వారు ఈరోజు ఓపికతో ముందుకు పోవాలి. అనుకూలమైన కోసం శ్రీ శివ పూజ చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. లాభాల బాటలో వ్యాపారాలు సాగుతాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఇంటా, బయట సమస్యలను అధిమిస్తారు. ప్రయాణాలు చేసే వారికి అనుకూలమైన రోజు. శుభ ఫలితాల కోసం హేరంబ అంటే పసుపు గణపతిని ఆరాధించండి

తులారాశి ఫలాలు : ఈరోజు వివాదాలకు ఆస్కారం ఉంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. బంధువులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. కొత్త అప్పులు లేదా చేబదులు తీసుకుంటారు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు రావచ్చు,మంచి ఫలితాల కోసం శ్రీలక్ష్మీ గణపతిని ఆరాధించండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా జయం. సంతోషంతో కూడిన రోజు. వ్యాపారులకు లాభాలు., ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. గతంలో నెలకొన్న వివాదాలు సర్దుకుంటాయి. కొత్త ప్లాట్లు, స్తలాలు కొనే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కుటుంబంలో సమస్యలు తీరతాయి. మంచి ఫలితాల కోసం శ్రీదుర్గాదేవి దగ్గర మందార పూలతో ఆరాధన, దీపం పెట్టడం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు లాభాలు కలుగుతాయి. శుభకార్య యత్నం చేస్తారు. పాత స్నేహితుల కలయికతో ఆనందం. సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంట్లో, బయటా గౌరవం పెరుగుతుంది. పనులు సాఫీగా సాగుతాయి. అనుకూలమైన ఫలితాల కొరకు శ్రీ శివ పంచాక్షరీ జపం చేయండి.

మకరరాశి : ఈరోజు మనసు కలత చెందే అవకాశం ఉంది. ప్రేమికుల అనవసర విషయాలను చర్చించకుండా ఉండాలి. ఆర్థికంగా ఇబ్బంది. ధనం కోసం మిత్రుల దగ్గర చేయి చాపాల్సి వస్తుంది. కుటుంబంలో చికాకులు. పనులు నత్తనడకన సాగుతాయి. శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి. పాత బాకీలు వసూలు కాక ఆర్థిక ఇబ్బందులు. అనుకోని కలహాలు వస్తాయి. పక్కవారితో తగాదాలు రావచ్చు. ఓపిక, సహనం చాలా ముఖ్యం.
దైవదర్శనాలు చేసే అవకాశం ఉంది. పనులు నిదానిస్తాయి. శుభ ఫలితాల కోసం శ్రీశివాభిషేకం చేయించండి. లేదా శివాలయంలో ప్రదోషకాలంలో దీపారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు సంతోషంతో పనులు వేగంగా పూర్తిచేస్తారు. దీనికి కారణం గ్రహచలనాలు. కార్యాలయాలలో పై అధికారుల ప్రశంసలు. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు వస్తాయి. విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నవారి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విద్యార్థులు లక్ష్యం సాధిస్తారు. మంచి శుభ ఫలితాల కోసం శ్రీ దత్త కవచం పారాయణం చేయండి.

Advertisement

Recent Posts

Prabhas : ప్రభాస్ తో నేను పెట్టుకోను .. భయపడుతున్న స్టార్ హీరో

Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…

30 minutes ago

Realme P4 Power 5G : రియల్‌మీ నుంచి పవర్ మాన్‌స్టర్.. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ పీ4 పవర్ 5జీ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే..!

Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…

2 hours ago

UPI : గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు శుభ‌వార్త‌.. యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయిందా..? ఇలా చేస్తే ఎక్స్‌ట్రా డ‌బ్బులు వ‌స్తాయి..!

Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…

2 hours ago

Sunitha : అందరి కంట్లో నీళ్ళు తెప్పించిన సింగర్ సునీత

Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…

4 hours ago

Tirumala Laddu Prasadam : తిరుమల లడ్డూ నెయ్యి వివాదం.. రాజకీయ దుమారానికి తెర

Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…

4 hours ago

Ys Jagan : బిగ్ బ్రేకింగ్.. ఆ పార్టీ తో జగన్ పొత్తు .. FIX అయిపోయిందా ?

Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…

6 hours ago

Vijay Karthik – Keerthi Bhat : డబ్బులేవని వదిలేసింది ఛీ .. కీర్తి భట్ ex చెప్పిన దారుణాలు

Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…

6 hours ago

KCR : బిగ్ బ్రేకింగ్.. ఫోన్ ట్యాపింగ్ లో మరో సంచలనం..కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్

KCR  : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…

7 hours ago