Zodiac signs : డిసెంబర్ 22 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : ఈరోజు మంచి వార్తలు వింటారు. శుభఫలితాలు వస్తాయి. మిత్రుల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రయాణాలు కలసి వస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. పని వత్తిడి బాగా పెరుగుతుంది. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాదనలకు అవకాశం జాగ్రత్త. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. అన్ని రకాల వ్యాపారులకు మమూలుగా ఉంటుంది. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి మంచి జరుగుతుంది.

మిధునరాశి ఫలాలు : సంతోషకరమైన రోజుల్లో ఇది ఒకటిగా మిగిలిపోతుంది. పెద్దల సలహాలు పాటించి ప్రయోజనాలు పొందుతారు. బంధువులు లేదా మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు విజయం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మహిళలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభఫలితాల కోసం శ్రీరామ రక్షస్తోత్రం పారాయణం చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అనుకోని వివాదాలు వస్తాయి జాగ్రత్త. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ఆర్థిక పరిస్థితులు మందగమనంలో ఉంటాయి. వ్యాపారాలు పెద్దగా జరుగవు. అప్పులకు ప్రయత్నాలు. విద్యార్థులు, ఉద్యోగులకు అవకాశాలు వస్తాయి కానీ ఉపయోగించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధనతో మంచి ఫలితాలు వస్తాయి.

Today Horoscope december 22 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఉల్లాసంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మంచి వార్తలు వింటారు. ఆర్థికంగా బాగుంటుంది. పాలు, కూరగాయలు, పండ్ల వ్యాపారులకు మంచిరోజు. విదేశీ యానం చేయాలనుకోనే వారు ప్రయత్నాలను నేడు ప్రారంభించండి. అమ్మవారి ఆరాధన చేయండి,

కన్యారాశి ఫలాలు : మీరు చాలా కాలంగా చేస్తున్న పనులు పూర్తవుతాయి. దీనితో మానసిక సంతోషం. మీ డ్రీమ్‌ ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తాయి. మహిళలు పని ఒత్తిడులు అధిగమిస్తారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి.విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

తులారాశి ఫలాలు : అనవసరంగా సమయం వృథా చేస్తారు. పనికి రాని విషయాలలో తలదూర్చి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు. అప్పుల బాధలు, అర్థికంగా మందగమనం. పనులు నెమ్మదిగా చేస్తారు. కుటుంబంలో పరిస్థితులు నిరాశ కలిగిస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామి వజ్రకవచం కనీసం 3 సార్లు చదువుకోండి.

వృశ్చికరాశి ఫలాలు : ప్రయాత్నాలు సఫలీకృతం కావు. పనులు ముందుకు సాగవు. ఆశించిన ఫలితాలు రావు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దల సలహాలను పాటించకపోవడంతో ఇబ్బందులు రావచ్చు. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లో, బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటంబంలో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. మహిళలకు సంతోషంగా ఉండే రోజు. పేదలకు అన్నదానం లేదా వస్త్ర దానం చేయండి.

మకరరాశి ఫలాలు : ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిన ధనలాభాలు కలుగుతాయి. పెద్దల ద్వారా మంచి జరుగుతుంది. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. కుటుంబంలో మార్పులకు అవకాశం. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనకూలమైన రోజు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ కాలభైరవాష్టకం చదువుకోండి లేదా వినండి.

కుంభరాశి ఫలాలు : ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని మాటల వల్ల మానసిక అశాంతి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు రావచ్చు. బంగారు లేదా డబ్బు జాగ్రత్త. మీ వస్తువులు దొంగలించబడటానికి అస్కారం ఉంది. మహిళలకు పని వత్తిడి పెరుగుతుంది. చండీదీపం/నిమ్మకాయ దీపం పెట్టండి మంచి జరుగుతుంది.

మీనరాశి ఫలాలు : అనుకోని ఖర్చులతో ఇబ్బందులు. సమయం వృథా, పని భారం పెరుగుతుంది. ఇంటా, బయటా విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. కుటుంబంలో మహిళలకు అనారోగ్య సూచన. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. శ్రీశివ, కేశవ ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

Recent Posts

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

52 minutes ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

2 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

2 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

3 hours ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

3 hours ago

MLC Kavitha : జగదీష్‌ రెడ్డి లిల్లీపుట్… కేసీఆర్ లేకపోతే ఆయనను చూసే వాడు కూడా ఉండడు కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…

4 hours ago

It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం … డిప్రెషన్ నుంచి బయటపడేదెలా…?

It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…

7 hours ago

White Onion : మీ కొలెస్ట్రాలను సర్ఫ్ వేసి కడిగినట్లుగా శుభ్రం చేసే అద్భుతమైన ఆహారం… ఏంటది..?

White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…

8 hours ago