Zodiac Signs : డిసెంబర్ 22 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 21 December 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు కొత్త పరిచయాలు కలుగుతాయి. ఆర్థికంగా ప్రయోజనకరమైన రోజు. పాత బాకీలు వసూలు అవుతాయి. చేసే పనులు నిదానంగా పూర్తిచేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ గురు ధ్యానం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు చేసే పనులలో ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. అవసరానికి ధనం మాత్రం చేతికి అందుతుంది. ఆఫీస్‌లో మీకు చికాకులు పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు. వ్యాపారలలో ఇబ్బందులు రావచ్చు. మహిళలకు పనిభారం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. ఆదాయంలో పెద్దగా మార్పులు ఉండవు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. చేసే పనులలో ఆటంకాలు. అనవసరమైన ఖర్చులు వస్తాయి. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం. ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు . శ్రీ శివపంచాక్షరీ మంత్రాన్ని జపించండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు రావచ్చు. ఆదాయంలో ప్రతికూలత కనిపిస్తుంది. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. చికాకులు, ఓపిక లేకపోవడం వంటివి జరుగవచ్చు. అనుకోని వివాదాలకు ఆస్కారం. ఆకస్మిక ప్రయాణాలు. మహిళలకు చికాకులు. అమ్మవారి ఆరాధన చేయండి.

Today Horoscope December 22 2022 Check Your Zodiac Signs

Today Horoscope December 22 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు శుభదినం మీకు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. మహిలలకు ధనలాభాలు. మీరుచేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. ఇష్టదేవతరాదన చేయండి.

కన్య రాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో కూడిన రోజు. ఆదాయంలో సాధారణ స్థితి. అనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు సానుకూలత కనిపస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు రావచ్చు. ప్రయాణ సూచన. అమ్మ తరపు వారి నుంచి సహకారం అందుతుంది. మహిళలకు మామూలు పలితాలు. గోసేవ, అన్నదానం చేయండి.

తులారాశి ఫలాలు : కొద్దిగా శ్రమిస్తే చాలు చక్కటి ఫలితాలు. ఆదాయంలో వృద్ధి, అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. సోదరీమణుల ద్వారా శుభవార్తలు వింటారు. చేసే పనులను వేగంగా పూర్తిచేస్తారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు మంచి రోజు. దత్తత్రేయారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మీరు మీ పని పైనే దృష్టిపెట్టాలి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. వైవాహిక జీవితంలో చిన్నచిన్నసమస్యలు రావచ్చు. ఆఫీస్‌లో పై అధికారుల వత్తిడి పెరుగతుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలం కాదు. మహిళలకు మానసిక వ్యథ. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : చాలా కాలం తర్వాత మీకు విశ్రాంతి లభిస్తుంది. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. కొత్త పరిచయాలు లాభాలను కలిగిస్తాయి. పెద్దల సహకారంతో పనులను వేగంగా పూర్తిచేస్తారు. ఆఫీస్లో మంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా పర్వాలేదు. మహిలలకు మామూలు రోజు. దగ్గరలోని దేవాలయంలో ప్రదక్షనలు, తీర్థం తీసుకోండి మంచి ఫలితాలు వస్తాయి.

మకర రాశి ఫలాలు : ఈరోజు చేసే పనులను వేగంగా పూర్తిచేస్తారు. సాయంత్రం కల్లా ఒక శుభవార్త అందుతుంది. అమ్మనాన్నల నుంచి సహాయసహకారాలు అందుతాయి. పెండింగ్‌ పనులను పూర్తిచేస్తారు. ప్రయాణ లాభాలు. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మహిళలకు మంచిరోజు. నవగ్రహరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా కష్టపడాల్సినరోజు. అయినా మీకు ఆనందంగా గడిచిపోయే రోజు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఆదాయంలోపెద్దగా మార్పులు లేవు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. పనులు పూర్తి, ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు,. అన్ని రకాలుగా బాగుంటుంది. ప్రశాంత వాతావరణం. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. చేసే పనులను సకాలంలో పూర్తిచేస్తారు,. షేర్‌ మార్కెట్‌లో లాభాలు వస్తాయి. అనుకోని అతిథి రాక మీకు సంతోసాన్ని కలిగిస్తుంది. మహిళలకు విశ్రాంతి లభిస్తుంది. శ్రీ హనుమాన్‌ ఆరాధన చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  2. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  3. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

  4. "NCC Army Jobs : అమ్మాయిలకు గుడ్ న్యూస్.. NCC ‘C’ సర్టిఫికెట్‌తో నేరుగా ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు"

  5. "Heavy Rain Alert : బిగ్ బ్రేకింగ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్..!"

  6. "Talliki Vandanam 2026 : ఏపీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తల్లికి వందనం నిధులు విడుదల.. మీ డబ్బులు వచ్చాయో ఇలా చెక్ చేసుకోండి"

  7. "Fact Check PM KISAN : పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్‌.. రూ.6,000 పెంపుపై కేంద్రం ఫుల్ క్లారిటీ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి