Zodiac Signs : డిసెంబర్ 23 శుక్రవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?
మేష రాశి ఫలాలు : పనులు చేసేటప్పుడు అలసత్వం చేయకండి. ఆనుకోని విధంగా లాభాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆనందంగా ఈరోజు గడుపుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : చక్కటి రోజు ఈరాశివారికి. ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. చేసే పనులలో ఇబ్బందులు. వ్యాపారాలయంతో ఊహించిన ధన లాభములు కలుగును. శుభవార్త వింటారు. పిల్లల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : అనుకోని విధంగా ఆటంకాలు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభించదు. వ్యాపారాలలో ఇబ్బందులు.
దూరపు ప్రయాణాలు ఏర్పడతాయి. మహిళలు ఇబ్బందులు. విలువైన వస్తువులు జాగ్రత్త. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం కల్లా శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో ధన లాభం. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. పాత బాకీలను వసూలు అవుతాయి. మహిళలకు ధనలాభాలు కలుగుతాయి. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.
సింహ రాశి ఫలాలు : ఆటంకాలతో పనులు పూర్తి కావు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఆర్థిక నష్టాలు. అనుకోని వారి నుంచి వివాదాలు వస్తాయి. దూర ప్రయాణ సూచన కనిపిస్తుంది. మహిళలకు దూరప్రాంతం నుంచి ఇబ్బందులు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు : తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడుతారు. ఆఫీస్లో ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో నష్టాలు. అనుకోని వారి నుంచి వివాదాలు వస్తాయి.
కుటుంబంలో సమస్యలు రావచ్చు. మహిళలకు ఇబ్బందులు. శ్రీ లక్ష్మీ సరస్వతి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణంతో కూడిన రోజు. అనుకోని ఆటంకాలు వస్తాయి. పనులలో జాప్యం జరుగుతుంది. బంధువుల నుంచి ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు. ఆర్తికంగా నష్టాలు. మంచి చేద్దామనుకున్నా చెడుగా కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు. శ్రీ దుర్గాసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని చోట నుంచి ఆదాయం వస్తుంది. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీస్‌లో ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మహిళలలు శుభవార్తలు వింటారు. కుటుంబంలో చక్కటి పరిస్థితి. ఇష్టదేవతారాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీస్లో మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి, విందులు, వినోదాలలో పాల్గొంటారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మంచి రోజు ఈరోజు. ఈరోజు చేసే పనులలో వేగం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు చక్కటి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మహిళలకు ఇబ్బందులు. శ్రీ విష్ణు సహస్రనామాలను ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం. పనులలో జాప్యం పెరుగుతుంది. ఆదాయంలో తగ్గుదల కానీ అవసరాలకు మాత్రం ధనం చేతికి అందుతుంది. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త తప్పనిసరి. కుటుంబంలో ఇబ్బందులు రావచ్చు ఓపికతో ముందుకుపోవాలి. పెద్దల మాటలు విని నిర్ణయాలు తీసుకోండి. వివాదాలకు దూరంగా ఉండాల్సినరోజు. అమ్మవారి ఆరాధన, దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
మీన రాశి ఫలాలు : పర్వాలేదు అన్నవిధంగా ఉంటుంది ఈరోజు. ఆదాయంలో సాధారణ స్థితి. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మహిళలు పనిభారం పెరుగుతుంది. ఇంటా, బయటా చికాకలు. శ్రీ లలితాదేవి సహస్రనామాలను పారాయణ చేయండి.