Zodiac Signs : డిసెంబర్ 26 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By aruna | The Telugu News | Published on: December 25, 2021, 10:40 pm

మేషరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. ఖర్చులు పెరుగుతాయి. మనస్సు నిశ్చలంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబంలో అనుకోని మార్పులు మంచి ఫలితాల కోసం ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. వృషభరాశి ఫలాలు : వత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోని చెడు వార్తలు వింటారు. అప్పుల బాధలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలు వస్తాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు వస్తాయి. కుటుంబంలో సఖ్యత. ఆర్థికంగా మంచి రోజు. ప్రయాణాలు కలసి వస్తాయి. శుభ ఫలితాల కోసం శ్రీ శివారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో చికాకులు ఏర్పుడుతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశజనకంగా ఉంటాయి. పని భారం పెరుగుతుంది. మహిళలకు ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. శ్రీ నవగ్రహాల ఆరాధన చేయండి.

Today horoscope december 26 2021 check your zodiac signs

Today horoscope december 26 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ప్రయత్నించిన కార్యాలలో విజయం సిద్ధి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థికంగా మంచిరోజు. మహిళలకు ఆర్థిక లాభాలు. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీనారాయణ స్వామి పూజ చేయండి.

కన్యారాశి ఫలాలు : ఇబ్బందులు. ప్రతికూల వాతావరణం. ఆర్థిక సమస్యలు, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. కుటుంబంలో అనారోగ్య సమస్యలు. పని వత్తిడి ఎక్కువ అవుతుంది. ప్రయాణాలు కలసి రావు. మంచి ఫలితాల కోసం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేయండి.

తులారాశి ఫలాలు : ఆటంకాలు తొలిగిపోయి పనులు వేగంగా పూర్తిచేస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో అనుకూల మార్పులు. మంచి ఫలితాలకోసం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : సామాజిక సేవాకార్యాక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక. కొత్త అవకాశాలు వస్తాయి. కుటంబంలో పనులు ఉత్సాహవంతంగా సాగుతాయి. మహిళలకు మంచి ఫలితాలు వస్తాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. అనారోగ్య సూచనలు కనిపిస్తుంది. కొత్త పనులు ప్రారంభించకండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాఫీగా సాగవు. చికాకులు వస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : అప్పులు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు కలసి వస్తాయి. ఆర్థిక ఇబ్బంది. కుటుంబంలో ముఖ్య విషయాలపై ఏకాభిప్రాయం రాదు. నిరుత్సాహంగా ఉంటుంది. శ్రీ శివ పంచాక్షరీ మంత్ర జపం చేయండి.

కుంభరాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. అన్ని పనులు పూర్తిచేస్తారు. ధనలాభాలు వస్తాయి. రుణాలు తీరుస్తారు. చాలా కాలంగా ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. శుభ ఫలితాలకోసం శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : శుభవార్త శ్రవణం. పెద్దల ఆశీస్సులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక విషయాలలో పురోగతి. ఆఫీస్‌లో మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. మహిళలకు స్వర్ణ లాభా యోగం. వస్త్ర లాభం.మంచి ఫలితాలకోసం శ్రీ విష్ణు ఆరాధన చేయండి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp