Zodiac Signs : డిసెంబర్ 27 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?
మేష రాశి ఫలాలు : ఈరోజు అన్ని రంగాల వారికి అనుకూలం. ముఖ్యంగా వ్యాపారులకు చక్కటి లాభాలు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . శ్రీ విష్ణు ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనుకోని వివాదాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. అనవసర ఖర్చులు వస్తాయి. మహిళలకు చికాకులు పెరుగుతాయి. ఆఫీస్‌లో పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . అనుకోని ఖర్చులు వస్తాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు చక్కటి లాభదాయకమైన రోజు. ఆదాయంలో పురోగతి కినిపిస్తుంది. కొత్త వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పెద్దల పరిచయాలు కలిసి వస్తాయి . బంధువులు, మిత్రుల శుభకార్యాలలో పాల్గొంటారు . విందు వినోదాల్లో పాల్గొంటారు . స్కందాయనమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు అనుకోని విధంగా మంచి పలితాలు సాధిస్తారు. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు. కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో పాల్గొంటారు. ఉత్సాహంగా ఉంటుంది. బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా చక్కటి రోజు. నవగ్రహారాధన చేయండి.,
సింహ రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ప్రతికూలమైన రోజు. అనుకోని ఖర్చులు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఊహించని ఇబ్బందులు ఏర్పడతాయి . వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. చేసే పనులలో ఇబ్బందులు. మహిళలకు ఇబ్బందికరమైన రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కన్య రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభవార్తలు వింటారు . ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది,. వ్యాపారాలకు ఈరోజు ధన లాభం కలుగుతుంది. చేసే పనులలో విజయం సాధిస్తారు . అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు ధనలాభాలు కలుగుతాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలత, అనుకూలత కలిసిన రోజు. ఆదాయంలోసాధారణ స్తితి. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలకు మధ్యస్తంగా ఉంటుంది. అనవసర విషయాలలో దూరంగా ఉండటం మంచిది నిరాశ నిస్పృహలకు లోనవుతారు అమ్మవారి ఆలయంలో ప్రదక్షణలు చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు చక్కటి రోజు, అనన్నింటా మీకు జయం. వివాదాలు పరిష్కారం. అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారములు యందు లాభం కలుగును . ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మహిళలకు ధనలాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : పనులను వేగంగా పూర్తిచేస్తారు. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆదాయంలో వృద్ధి, సమాజంలో మీకు మంచి కీర్తి ప్రతిష్టల పెరుగును . వ్యాపారం నందు ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . పాత బాకీలు వసూలు అగును . గోసేవ చేయండి.
మకర రాశి ఫలాలు : కొద్దిగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయంలో పెరుగదల ఉన్నా అనుకోని ఖర్చులతో ఇబ్బందులు. అమ్మ తరపు వారి నుంచి ఇబ్బందులు. కుటుంబంలో మాట పట్టింపులు అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు ఆకస్మిక ధనలాభం. మనసుకు ప్రశాంతత లభించును. చేసే పనుల లో పురోగతి కనిపిస్తుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఆఫీస్లో సహోద్యోగులు సహాయ సహకారం లభించును. ప్రయాణాలు లాభదాయకం. శివారాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. ఆదాయంలో సాధారణ స్తితి. ఇంటా, బయటా మీకు కొద్దిగా ఇబ్బందులు రావచ్చు. అనవసర ఖర్చులు. వాదోపవాదాలుకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి మహిళలకు పనిభారం. నమ్మినవారితో మోసం జరిగే అవకాశలు, నవగ్రహారాధన చేయండి.