A man came into the life of Aquarius
మేషరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో ఈరోజు గడుస్తుంది. అనుకోని ప్రయాణాలు. పనులు నెమ్మదిస్తాయి. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకు పర్వాలేదు. కుటంబంలో అందరి మధ్య సఖ్యత పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య భంగం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఆరోగ్యం పై శ్రద్ద అవసరం. అనవసర ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. చివరి నిమిషంలో జరిగే మార్పులతో ఇబ్బందులు. పనులు మనస్సు పెట్టి చేయలేరు. విద్యార్థులు, ఉద్యోగులకు పరిస్తితి సాధారణంగా ఉంటుంది. ఎర్రవత్తులతో దీపారాధన చేయండి మంచి జరుగుతుంది.
మిథునరాశి ఫలాలు : అన్నింటా విజయం. అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలమైన వాతావరణం. ఆనందం, ప్రశాంతత కలిగిన రోజు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు అనకూలంగా ఉంటయాఇ.ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ప్రతికూల విషయాలతో చికాకులు. ఇంటా, బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు. అప్పుల కోసం ప్రయత్నం. ఆరోగ్య భంగం కనిపిస్తుంది. మహిళలకు చికాకులు. శ్రీ దుర్గాదేవిని దుర్గా సూక్తంతో పూజించండి.
Today Horoscope february 18 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఐటీ, రియల్, కిరాణ వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు. మహిళలకు శుభదినం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలు రావు, అన్నింటా చికాకులు, ప్రతికూలతలు. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఇంటా, బయటా మీకు పరిస్థితులు కలిసిరావు. ఆఫీస్‌లో బాధ్యతలు పెరుగుతాయి. అధికమవుతాయి. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ కామాక్షీ దేవతారాధన చేయండి.
తులారాశి ఫలాలు : పెద్దల సలహాలతో ప్రయోజనాలు పొందుతారు. మిత్రుల సహకారంతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనువైన రోజు. కుటుంబంలో పనులు సాఫీగా సాగుతాయి. విందులు, వినోదాలలో ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు ఆర్థిక లాభాలు. శ్రీలక్ష్మీ అష్టోతరంతో అమ్మవారిని ఆరాధించండి.
వృశ్చికరాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అన్ని రంగాల వారికి చక్కటి రోజు. ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా సాగుతాయి. మిత్రులు, బంధువుల నుంచి సహాయం అందుతుంది. ధనలాభం కనిపిస్తుంది. విద్యార్థులకు శుభ ఫలితాలు. మహిళలకు విశ్రాంతి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : కొంచెం ప్రతికూల వాతావరణంతో ఈరోజు గడుస్తుంది. అప్పుల బాధలు. గతంలో చేసిన పొరపాట్ల వల్ల ఈరోజు ఇబ్బందులు పడుతారు. కుటుంబంలో చికాకులు. అనవసర వివాదాలు. ఆర్థిక ప్రతికూలతతో ఇబ్బందులు. మహిళలకు పని బారం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఇబ్బందికరంగా ఉంటుంది. అర్థిక మందగమనం. ఎవరితో అనవసర విషయాలు మాట్లాడకండి. గ్రహాల గమన రీత్యా మీకు ఈరోజు కొంత ప్రతికూలత కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. అప్పుల సమస్యలు. మిత్ర బేధం వల్ల ఇబ్బందులు. శ్రీ సంకటహర గణపతి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : శుభదినం. అనుకూలమైన వాతావరణం. అప్పులు తీరుస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు శుభ పలితాలు. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అవకాశం. ప్రమోషన్‌కు అవకాశం. మహిళలకు లాభం. ఇష్టేదేవతరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : అన్ని రంగాల వారికి అనుకూలమైన రోజు. వ్యాపారాలు సాఫీగా, లాబాల బాటలో నడుస్తాయి. విద్యార్థులకు కార్య జయం. రియల్, ఫార్మ, కిరాణం, వడ్డీ వ్యాపారులకు మంచి రోజు. కుటుంబంలో శుభకార్య యోచన. మహిళలకు స్వర్ణ లాభాలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.