Gowthami : గౌతమి.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగింది. 1968లో ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించిన గౌతమి.. గీతం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. దయామయుడు మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది. తర్వాత తెలుగుతో పాటు తమిళంగా స్టార్ హీరోయిన్‌గా మారింది. అమలా, భానుప్రియ వంటి పెద్ద హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. గౌతమి కేవలం మూవీస్ లోనే కాకుండా పలు సీరియల్స్ లోనూ యాక్ట్ చేసింది.
తమిళంలో ఇందిరా అనే సీరియల్ లో మెయిన్ రోల్ లో యాక్ట్ చేసింది. ఇక 2000 సంవత్సరంలో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో విడాకులయ్యాయి.గౌతమి మొదటి భర్త పేరు సందీప్ భాటియా.. వీరిద్దరు 1998లో పెళ్లి చేసుకున్నారు. 1999లో దూరమయ్యారు. తర్వాత ఏడాదికే కమల్ హాసన్ కు దగ్గరైన గౌతమి.లివింగ్ ఇన్ రిలేషన్ షిప్‌ను కొనసాగించింది. సుమారు 12 ఏళ్ల పాటు వారిద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం సాగించారు. తర్వాత కమల్ హాసన్ తనను శారీరకంగా, ఆర్థికంగా చాలా వాడుకున్నాడని ఆరోపణలు చేసింది.
తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మీడియా ముందే కన్నీరు పెట్టుకుంది. ఆమె వ్యాఖ్యలు దేశవ్యాపంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా ఆమె మొదటి భర్త భారతీయ ఫైనాన్షియల్ అనలిస్ట్.. ఇతడు ప్రతి రోజూ టీవీల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న అతన్ని వదులుకుని ఓ హీరో వెనకాల పడి చివరకు ఒంటరిగా మారింది గౌతమి. ఇక గౌతమికి 1999లో ఓ కూతురు జన్మించింది. ఆమె కోసమే జీవిస్తున్నట్టు గౌతమి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.