Horoscope : మార్చి 27 రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి వ్యాపారాల్లో అధిక లాభాలు !

Horoscope మేషరాశి : స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన వృద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తు లు కార్యాలయాల్లో పదోన్నతలు పొందుతారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని స్నేహితులను తిరిగి పొందుతారు. ఈరోజు అలవేలుమంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృషభరాశి : ఆరోగ్యంగా ఉంటారు !

ఈ రోజు బాగుంటుంది. మీ స్థాయికి మించిన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. గతంలో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది.ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.

మిధున రాశి : ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు.హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

horoscope

కర్కాటక రాశి : వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయిన వారిని దూరం చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

సింహరాశి : పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన వృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. వ్యాపారాల్లో ధన వృద్ధి కలుగుతుంది.దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కన్యారాశి : అనవసర ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. రుణ బాటలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. ప్రయాణ ఇబ్బందులు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇతరులకు మాట ఇవ్వడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

తులారాశి : ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. గతంలో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ఈరోజు శ్రీ రాఘవేంద్ర స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి : పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ఈరోజు కనకధారా స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి : ఆనందంగా ఉంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు. ఆకస్మిక ప్రయాణ లాభాలు కలుగుతాయి. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. మిత్ర లాభం కలుగుతుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను, డబ్బులను తిరిగి పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆనందంగా ఉంటారు. మిత్రుల సహకారం పొందుతారు.ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి : సహాయం చేసే వారు దూరం అవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. మీకు సహాయం చేసే వారు దూరం అవుతారు. ప్రయాణ ఇబ్బందులు. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల నష్టం. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు.ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.

కుంభరాశి : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అవసరానికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి.శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

మీన రాశి : వ్యాపారాల్లో అధిక లాభాలు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తారు. వివాహాది సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో అధిక లాభాలు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన వృద్ధి కలుగుతుంది.ఈరోజు శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

Recent Posts

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

51 seconds ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

9 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

10 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

11 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

13 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

14 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

15 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

16 hours ago