Today Horoscope : న‌వంబ‌ర్‌ 03 2021 బుధ‌వారం మీ రాశిఫ‌లాలు

Authored By Devotional Desk | The Telugu News | Updated on : 3 November 2021, 6:00 am

మేష రాశి ఫలాలు : ఈరోజు ఆందోళన చెందుతారు. మిత్రులతో సహకారం పొందుతారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉమ్మడి వ్యాపారాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. పేదలకు అన్నదానం చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు సమస్యల నుంచి బయటపడుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమికులు సర్ప్రైజ్ అందుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మరింత శ్రద్ధ అవసరం. ఆఫీస్‌లో అన్ని విషయాలు ఈరోజు అద్భుతంగా గడుస్తుంది. వాదనలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. గోవులకు గ్రాసం సమర్పించండి.

today horoscope in telugu

today horoscope in telugu

మిథునరాశి ఫలాలు : ఈరోజు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. తల్లిదండ్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఆఫీస్‌లో మంచి వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు పోతాయి. వ్యాపారులకు సాధారణ లాభాలు. వైవాహిక జీవితంలో అత్యుత్తమమైన రోజు. అమ్మవారికి శనగల ప్రసాదాన్ని సమర్పించండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఫుల్‌ ఎనర్జీతో గడుపుతారు. చెడువ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రేమ కానుకలను అందుకుంటారు. మీ చుట్టూ ఉన్నవారితో నవ్వులను పూయిస్తారు. జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి.

సింహరాశి ఫలాలు : ఈరోజు ప్రారంభంలో కొన్ని కష్టాలను ఎదురుకొంటారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక నష్టాలు రావచ్చు. విద్యార్థులు సృజనాత్మకతతో పనిచేయాల్సిన రోజు. ఆఫీస్లో మంచిరోజు. కుటుంబంలో ఆహ్లాదం చేకూరుతుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రివార్డులు అందుకుంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శ్రీ శివాభిషేకం చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు ఆనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. తెలివితేటలతో పనులు చేయాల్సినరోజు. ప్రియమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యవ్యక్తులతో ఆచితూచి మాట్లాడాల్సిన రోజు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ధనలాభాలు కనిపిస్తున్నాయి. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

తులారాశి ఫలాలు : ఈరోజు సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విశ్వాసంతో పనిచేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆఫీస్‌లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర తగాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. ప్రేమికులు ద్వేషాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో చిన్న సమస్యలు ఎదురుకుంటారు. శ్రీ లక్ష్మీ ఆష్టోతరం పూజ చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అభివృద్ధి కనిపిస్తుంది. సామూహిక కార్యక్రమాలలో పాల్గొం టారు. మీ ఖర్చులు పెరుగుతాయి. ప్రేమికుల ద్వేషాన్ని పెంచుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో సమస్యలు రావచ్చు. స్థిరమైన ఆర్థిక జీవితాన్ని పొందడానికి దుర్గాదేవిని ఆరాధించిండి.

ధనుస్సురాశి ఫలాలు : ఆర్థిక పరిస్థితిలలో మెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఆశ, నిరాశలో వ్యాపారులు ఉగిసలాట ఆడుతారు. రహస్య వ్యవహారాల విషయంలో జాగ్రత్తలు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో వల్ల ఇబ్బందులు పడుతారు. శ్రీరామ తారకాన్ని జపించండి.

మకరరాశి ఫలాలు : విజయం, ఆనందం మీ సొంతం. స్నేహితులతో సంతోషాన్ని పంచుకుంటారు. అప్పులు తీరుస్తారు. ఆర్తిక సమస్యలు రావచ్చు. వివాహ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. భాగస్వామి వ్యాపారంతో లాభాలు గడిస్తారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం. జీవిత భాగస్వామితో మంచిగా కాలక్షేపం చేస్తారు. రోగులకు, పేదలకు సహాయం చేయండి.

Daily horoscope in telugu

Daily horoscope in telugu

కుంభరాశి ఫలాలు : ఈరోజు మానసిక ఉద్వేగానికి గురివుతారు. ఆర్థికంగా బాగుంటుంది.అనవసర ఖర్చులు రావచ్చు. సంతోషం నిండిన రోజు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఆఫీస్లో మంచి వాతావరణం. ప్రమోషన్‌లకు అవకాశం ఉంది. స్నేహితులు కోపం తెప్పిస్తారు.నవగ్రహ ప్రదక్షణాలను చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు ఆతిథులు రాక మీకు సంతోషం కలిగిస్తుంది. ధనాన్ని బాగా సంపాదిస్తారు. కలహాలకు దూరంగా ఉంటారు. వ్యాపారులకు లాభాలు రావచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనువైన రోజు. భాగస్వామితో ఆనందంగా ఉంటారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

Advertisement

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి