Today horoscope : అక్టోబ‌ర్ 15 2021 శుక్ర‌వారం మీ రాశిఫ‌లాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today horoscope : అక్టోబ‌ర్ 15 2021 శుక్ర‌వారం మీ రాశిఫ‌లాలు

 Authored By keshava | The Telugu News | Updated on :15 October 2021,6:40 am

మేష రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. ధన లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. బంధువులు సహాయం అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోపాల్గొంటారు. విందులు, వినోదాలు. వైవాహికంగా మంచి జీవితం ఈరోజు పొందుతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొంచెం నీరసంగా ఉండే అవకాశం ఉంది. అనవసర విషయాలలో జోక్య్ం చేసుకోకండి. విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ధనలాభం, పిల్లల వల్ల సంతోషం, పెద్దల సహకారం లభిస్తుంది. మీ కార్యక్రమాలు వాయిదా వెయ్యండి. ఆర్థికపరంగా మంచి స్థితిలో ఉంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తారు. దేవాలయ సందర్శన చేయండి.


మిథున రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. సాయంత్రం గడిచే కొద్ది పెద్దలు, కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు పోతారు. దేవాలయ దర్శనం చేస్తారు. పాత పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. ఈరోజు అనుకోని, ఎదురుచూడని చోట నుండి, మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి,. ఓపికతో ఉండండి. విద్యార్థులు ప్రయత్నాలు ప్రారంభించడానికి మంచి రోజు. అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మీ ఓర్పుకు పరీక్ష పెట్టినట్లు ఉంటుంది. కానీ అంతిమంగా మీరు విజయం సాధిస్తారు. నైతిక విలువలను వదులుకోకండి. పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ధన స్థితి మంచిగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనువైన కాలం. విద్యార్థులకు మంచి యోగ కాలం. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ విజయదుర్గా అమ్మవారిని ఆరాధించండి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహ రాశి ఫలాలు : ఈరోజు సంతోషకరమైన రోజు. ఆరోగ్యం, ఆనందం మీ సొంతం. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు. ప్రశాంతమైన మానసిక స్థితి. ఆర్థికలాభాలు. మంచి లాభలు ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన వార్త మిమ్మల్ని ఆనందపర్స్తుంది. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు. ఆధ్యాత్మికకార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు సంతోష వార్తలు వింటారు. శమీ పూజ, ఆయుధ పూజ చేసుకోండి. చికిత్స :- దుర్గా దేవి ఆలయంలో అందించే ప్రసాదంను పేద ప్రజలతో పంచుకొని మంచి కుటుంబ జీవితం సాధించాలి.


కన్యా రాశి ఫలాలు : ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. పనులను ఉత్సాహంగా చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. మంచి లాభాలు గడిస్తారు. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. మీ పిల్లలతో సంతోషాన్ని పొందుతారు. ఆఫీస్‌లో మీ శ్రమ ఫలిస్తుంది. ప్రయాణం ప్రయోజన కరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందం పొందుతారు. విద్యార్థులకు చక్కటి రోజు. శ్రీ విజయదుర్గాదేవి ఆరాధన చేయండి. తులా రాశి ఫలాలు : ఈరోజు ధనలాభాలు వస్తాయి. ఆశతో అనేక పనులు చేస్తారు. అనవసర ఖర్చుల ఈరోజు మీకు వస్తాయి. మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి,. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు పోతారు. శ్రీ కనకదుర్గాదేవిని ఆరాధన చేయండి. వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు. ధనాన్ని ఖర్చుచేస్తారు. కానీ చివరకు పొదుపు చేస్తారు. చెడు అలవాట్లకు ఈరోజు దూరంగా ఉండండి. ఆఫీస్‌లో మీరు పూర్తిచేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషనలు పొందుతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు.విద్యార్థులక విజయ సమయం ఇది. కేవలం శ్రమిస్తే విజయం మీ సొంతం. దుర్గాదేవి ఆరాధన చేయండి.


ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల వాతావరణం ఉంటుంది. నిరాశను మీ మనసులోకి రానివ్వకండి. అనుకోని మార్గాలలో ధనం వస్తుంది. వ్యాపారులకు లాభాలు. అనుకోని అతిథులు వస్తారు. సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభుయలతో ఆనందం. విద్యార్థులకు మంచి కాలం. వైవాహికంగా బాగుంటుంది. శమీ పూజ చేయండి. మకర రాశి ఫలాలు ; ఈరోజు అంతా బాగుంటుంది. ఆరోగ్యం, ఆనందం మీ సొంతం. అనుకోని లాభాలు, షేర్లు, స్పెక్యులేషన్‌లో అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ ప్రేమజీవితం బాగుంటుంది. ఈరోజు మీరు తీసుకోనే నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు విజయం. కుటుంబ జీవితం ఆనందగా సాగుతుంది. విజయదుర్గా అమ్మవారిని ఆరాధించండి.

today horoscope in telugu october 15 Friday 2021

today horoscope in telugu october 15 Friday 2021


కుంభ రాశి ఫలాలు : ఈరోజు సంతోషాన్ని పొందడానికి ఓపికతో గడపాలి. ఆనందం మీ సొంతం కావాలంటే కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. అత్తామామల నుండి ఆర్ధిక ప్రయోజనాలు లభిస్తాయి. అతిథులను ప్రేమతో చూసుకోండి. బంధుత్వాలు బలపడిపోతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుందిదుర్గా సప్తశతి వినండి. లేదా దేవాలయం దర్శనం చేసుకోండి. మీన రాశి ఫలాలు : ఈరోజు బాల్య స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. అనవసర విషయాలను ఆలోచించి మానసిక ప్రశాంతతకు భంగం కలిగించుకుంటారు. ఈరోజు మీరు ధన సంబంధిత సమస్యలను ఎదురుకుంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు మీ తల్లిదంద్రులకు చెప్పి వారి నిర్ణయం ప్రకారం ముందుకు పోండి. ఆఫీస్‌లో సహోద్యోగులు సహకారం అందిస్తారు. విద్యార్థులకు బాగా మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా సంతోషం మీ సొంతం. శ్రీ విజయ దుర్గాదేవి ఆరాధన చేయండి మంచి పలితాలను పొందండి.

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది