Today horoscope : అక్టోబ‌ర్ 21 2021 గురువారం మీ రాశిఫ‌లాలు

మేషరాశి ఫలాలు : ఈరోజు మీ శక్తియుక్తులను ఉపయోగించి ముందుకుపోతారు. సోదర,సోదరీ సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఈరోజు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వైవాహిక బాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు అనవసర విషయాలలో తలదూర్చకండి. లేకపోతే అనేక సమస్యల్లో చిక్కుకుంటారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు చేయకండి. వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆఫీస్లో ఓపికతో పనిచేయాల్సిన సమయం. జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు రావచ్చు. శివాలయంలో అభిషేకం చేయించుకోండి.

today horoscope in telugu

మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని దానధర్మాలు చేస్తారు. బంధువుల నుంచి వత్తిడులు వస్తాయి. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. కార్యాలయాలలో మంచి వార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలసి ఆనందంగా గడుపుతారు. సాయిబాబా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఓపిక, నిగ్రహంతో వ్యవహరించాల్సిన రోజు. ఇంటికోసం గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమస్యలు రావచ్చు. పాత జ్ఞాపకాలను కుటంబ సభ్యులతో పంచుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవాలి. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

సింహరాశి ఫలాలు : ఈరోజు కోపంతో అనేక ఇబ్బందులు పడుతారు. ఆఫీస్లో ఓపికతో, శ్రద్ధతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అనవసర ఆందోళనలు పడుతారు. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. వైవాహిక జీవితంలో సాధారణంగా ఉంటుంది. శ్రీ దత్త కవచం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. పెట్టుబడులు పెడుతారు. వ్యాపారులకు లాభాలు. ఆరోగ్యం కోసం ఖర్చులు చేస్తారు. ప్రేమ కలాప విషయాలలో జాగ్రత్త. ఆఫీస్లో పదోన్నతులకు అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వైవాహికంగా సంతోషకరమైన రోజు. శ్రీ రామ రక్ష స్తోత్రం చదువుకోండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఆనందంగా ఉంటారు. కొత్త ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటారు. ధనం ఈరోజు ప్రవాహం లాగా వస్తుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ప్రేమలో కఠినంగా ఉండకండి. మంచి ఆహారం, సంగీతం ఈరోజు మీ సొంతం. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు బాగా శ్రమించాల్సి రోజు. శ్రీకృష్ణ ఆరాధన చేయండి.

today horoscope in telugu

ధనుస్సురాశి ఫలాలు : ఆరోజు వ్యాపార విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. పెట్టుబడులు పెట్టే టప్పుడు అన్ని విషయాలన ఆలోచించి ముందుకు పోండి. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలను చర్చిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శ్రీ దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు అనేక ఇబ్బందులు ఎదురుకొంటారు. ధైర్యంతో పనులు పనిచేయండి. ఆఫీస్లో సహోద్యోగులతో ప్రేమతో, ఓపికతో వ్యవహరించండి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సానుకూల దృక్పథంతో సమస్యలను అధిగమించుకుంటారు. ప్రేమ విషయంలో మంచి వార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సర్ప్రైజ్నిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. మీ తెలివితేటలతో ముందుకుపోతారు. ఆఫీస్లో, ఇంట్లో మంచి వార్తలు వింటారు. సంతానంతో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈరోజు దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఈరోజు కాలాన్ని సద్వినియోగం చేసుకోంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆందోళనకు దూరంగా ఉండండి. స్నేహితులు సమస్యలలో చిక్కుకుంటారు. మీరు వారికి సహాయం చేయాల్సిన సమయం. ఆఫీస్లో ఈరోజు మీకు మంచి జరుగుతుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రేమలో ఇబ్బందులు. తప్పుడు సమాచారానికి దూరంగా ఉండాల్సిన సమయం. శ్రీ లక్ష్మీ దేవిని ఆరాధించండి మంచి ఫలితాలు వస్తాయి.

Recent Posts

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

3 minutes ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

2 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

2 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

5 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

6 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

7 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

9 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

10 hours ago