KCR : కేసీఆర్ కు ఎంత వ్యతిరేకత ఉంటే.. అంత ఓట్లు ఎక్కువ వ‌స్తాయ‌ట‌.. ఈ లాజిక్ ఏంటి..?

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఆయన లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడని ఇటీవల పలు సర్వేలు తెలిపాయి. ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్, సీ ఓటర్ సర్వే ప్రకారంగా.. దాదాపు 30.3 పర్సంటేజ్ ప్రజానీకం కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. అయితే, కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయను ఆమోదించే వారి శాతం కూడా అంత కంటే ఎక్కువ ఉంటుందని గులాబీ పార్టీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.గతంలో కూడా చాలా మంది టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ఆదరణ తగ్గిందని చెప్పారని, కానీ, తమ పార్టీ ఫస్ట్ టర్మ్ కంటే సెకండ్ టర్మ్‌లో ఎక్కువ సీట్లు గెలుచుకుందని పింక్ పార్టీ నేతలు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేదన్న విషయం అందరికీ విదితమే.

kcr

ఇప్పుడిప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలపడే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, నిజంగా బలమైన ప్రతిపక్షం లేదని, అదే టీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసొస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇకపోతే కేసీఆర్ వర్కింగ్ స్టైల్ మిగతా అందరికంటే భిన్నంగా ఉంటుందని, ప్రజలకు చేరువవడంలో ఆయనది అందరి కంటే భిన్నమైన శైలి అని రాజకీయ పరిశీలకులు అంటుంటారు. టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు వినూత్నంగా చేపట్టేందుకుగాను, ప్రచార సరళిలోనూ అన్నిటా భిన్నమైన వ్యవహారం కేసీఆర్ చేస్తారని అంటున్నారు. ఇకపోతే కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇతరాలు అన్ని కూడా ప్రజలకు చేరువయ్యాయని, కాబట్టి తమకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులుండబోవని టీఆర్ఎస్ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

KCR : బలమైన ప్రతిపక్షం లేకపోవడమే టీఆర్ఎస్‌కు బలం..

టీఆర్ఎస్ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఎన్ని సర్వేలు చెప్పనప్పటికీ కేసీఆర్ మంత్రమే టీఆర్ఎస్‌ను రాజకీయంగా అధికారంలో ఉంచుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ అవి బలపడి ఓట్లు చీల్చడం, అధికారంలోకి రావడం అంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు కొందరు అంచనా వేస్తున్నారు.

Recent Posts

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

2 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

4 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

6 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

7 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

8 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

9 hours ago

Weight | బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త.. అరటిపండు,యాపిల్‌ల‌లో ఏది బెస్ట్‌

Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…

10 hours ago

Liver Cancer | కాలేయ క్యాన్సర్ పై అవగాహన పెంపు అవసరం.. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు

Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…

11 hours ago