Zodiac Signs : జనవరి 02 సోమవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?
మేష రాశి ఫలాలు : ఇంటా, బయటా అనుకోని వత్తిడి ఉంటుంది. అన్ని వృత్తుల వారికి ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఇబ్బందులు ధైర్యంతో ఎదురుకుంటారు. శ్రీ లక్ష్మీ, సోమేశ్వరస్వామి దేవి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోక మానసిక ఇబ్బందులు. మిత్రులతో ఇబ్బందులు వస్తాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. ప్రయాణాలలో ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మిథున రాశి ఫలాలు : కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. అనుకోని ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. పిల్లలతో ఇబ్బందులు వస్తాయి. స్వల్ప అనారోగ్య సూచన. ఆదాయంలో సాధారణ స్తితి. ప్రయాణాలలో ఇబ్బందులు. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆదాయంలో సాధారణ స్తితి. ఇబ్బందులు తొలిగిపోతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మనస్పర్ధలు ఇబ్బందులు. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. మహిళలకు శుభవార్తలు. శ్రీ కాలభైరావష్టకం పారాయణం చేయండి
సింహ రాశి ఫలాలు : చక్కటి శుభవార్తలు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడను. మిత్రులతో విభేదాలు ఏర్పడను. తొందరపాటు పనుల్లో ప్రతికూలత వాతావరణ మహిళలకు ఇబ్బందులు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
కన్య రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజములో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ శివారాధన చేయండి.,
తులారాశి ఫలాలు : అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఓం లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మీ తెలివితేటలతో ముందుకుపోతారు. చేసే పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అనుకోని ప్రయాణాలు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. మహిళలకు ధనలాభలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో ఇబ్బందులు. అనవసరమైన ఖర్చులు. మిత్రులతో మాట పట్టింపులు రావచ్చును . ఇంట్లో పరిస్థితులు ఆందోళనగా ఉంటుంది . చేసే పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అనుకూలతతో కూడిన రోజు. ఆర్థికంగా పర్వాలేదు. అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.మహిళలకు లాభదాయకమైన రోజు,. ఇష్టదేవతారధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కుటుంబంలో ప్రశాంత వాతావరణం. ఆదాయంలో వృద్ధి, పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. శుభకార్య యోచన చేస్తారు. ఆఫీస్లో ఇబ్బందులు తొలిగిపోతాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ నారాయణ ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు మీరు శుభవార్తలు వింటారు . వ్యాపారాల్లో లాభం వస్తుంది. చేసే పనులలో విజయం సాధిస్తారు . ఇంట్లో సమస్యలను తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. బయటా మీకు అనుకూలమైన వాతావరణం. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాదన చేయండి.