Home » Devotional » Today Horoscope January 16 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జనవరి 16 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Devotional Desk
The Telugu News | Published on: January 15, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. అలసట, పెద్దల నుంచి సహాయ నిరాకరణ. బంధువుల రాకతో ఇబ్బందులు. మహిళలకు శుభంగా ఉంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి, వృషభరాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో అనుకోని శుభవార్తలు వింటారు. గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మహిళలకు పలుకుబడి పెరుగుతుంది. శ్రీసూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక మందగమనం. అనుకోని నష్టాలు. పిల్లల వల్ల శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు. మహిళలకు మంచి ఫలితాలు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటుంది. అనుకోని లాభాలు. కుటుంబంలో శుభ కార్య యోచన చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో లాభాలు. విద్యార్థులకు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకు స్వర్ణ లాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.

Today Horoscope january 16 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : ఈరోజు కొత్త అవకాశాలు. విజయం, సంతోషకరమైన రోజు. స్వర్ణ ఆభరణాలు కొంటారు. బంధువుల కలయికతో ఆనందం. కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట్లో సందడి వాతావరణం. శ్రీరామ తారకాన్ని జపించండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు. ఆర్థిక మందగమనం. అనుకోని నష్టాలు. మహిళలకు తీవ్ర మనస్తాపం. వివాదాలు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.,

Advertisement

తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకోని చోట నుంచి శుభ వార్తలు వింటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మహిళలకు ఒత్తిడులు. అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని ధనలాభాలు. ధనప్రవాహంతో సంతోషం. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలకు హాజరు అవుతారు. లు. మహిలకు నూతనోత్సాహం. కాలభైరావష్టకం పారాయణం చేయండి.

ధనస్సురాశి ఫలాలు : నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పురోగతి. వ్యాపారాలు లాభాలు గడిస్తారు. విద్యార్థులు,ఉద్యోగార్థులు మంచి వార్తలు వింటారు. మహిళలకు శుభ దినం. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. ధనం కోసం పాట్లు. నిరాశజనకంగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. విందులకు హాజరవుతారు. మహిళలకు నిరాశజనకంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : అదాయం పెరుగుతుంది. అంతే ఖర్చులు కూడా పెరుగుతాయి. అలసట. అనుకోని అతిథుల రాకతో సందడి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. దూరప్రయాణాలు. చికాకులు. అనారోగ్యం సూచన. మహిళలకు అనుకోని ప్రయాణాలు. సూర్యనారాయణ ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : అనుకోని లాభాలు. శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మంచి పరిస్థితి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు. ఉద్యోగులకు కోరుకున్న స్థానచలనం. మహిళలకు వస్త్రలాభం. మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి