Home » Devotional » Today Horoscope January 20 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జనవరి 20 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 20, 2022 8:42 am
Advertisement

మేషరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో ఈరోజు గడుస్తుంది. అనుకోని ఇబ్బందులు. పెద్దల సహకారం. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పిల్లల వల్ల చికాకులు. కుటుంబంలో అనుకోని మార్పులు. మహిళలకు చికాకులు. శ్రీ లలితా దేవి ఆరాధన  చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపార లావాదేవీల వల్ల లాభాలు వస్తాయి. పాలు, కిరాణం, మెడికల్ రంగాల వారికి శుభకరమైన రోజు. పెద్దల పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం తెలుస్తుంది. మహిళలకు లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి…

Advertisement

మిధునరాశి ఫలాలు : కొంచెం ప్రతికూల వాతావరణం. అనుకోని ఇబ్బందులు, చికాకులు, పనులు నెమ్మదిగా సాగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక మందగమనం. ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు౯ పని భారం పెరుగుతుంది. శ్రీ దత్తత్రేయ కవచం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అత్యంత శుభకరమైన రోజు. పని చేసే చోట ప్రశసంసలు. ఆర్థికంగా అనుకోని లాభాలు కనిపిస్తున్నాయి… కొత్త వ్యక్తుల ద్వారా ముఖ్య సమాచారం తెలుస్తుంది.చాలా కాలంగా వసూలు కాని బాకీలు వసూలవుతాయి. మహిళలకు శుభవార్త శ్రవణం. అమ్మవారి ఆరాధన చెప్పుకో తగ్గ సూచన…

Today Horoscope january 20 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : అనుకోని వివాదాలు. పక్కవారితో ఇబ్బందులు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్య సూచన. ఆర్థికంగా నిరాశజనకంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త వహించండి. మహిళలకు విశ్రాంతి దొరకదు. శుభ ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి వజ్రకవచాన్ని కనీసం 3 సార్లు చదువుకోండి లేదా వినండి.

కన్యారాశి ఫలాలు : మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం నిండిన రోజు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మెడికల్‌, ఫైనాన్స్‌ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆఫీస్లో ప్రశంసలు. మహిళలకు లాభ సూచన. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఉత్సాహంగా గడుపుతారు. ఆనందంతో ఈరోజు గడిచిపోతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.   ప్రయాణాల వల్ల ప్రయోజనాలు. మహిళలకు సానుకూలమైన రోజు. అన్ని రంగాల వారికి మంచి రోజు. ఇష్టేదేవతరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరమైన రోజు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆఫీస్‌లో, ఇంటా పని బారం పెరుగుతుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో మంచి చేద్దామన్న వారు అర్థం చేసుకోరు.   మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీలలితా దేవి సహస్రనామాలను శుచితో పారాయణం చేయండి. లేదా వినండి.

ధనుస్సురాశి ఫలాలు : ప్రతికూల ఫలితాలతో   ఇబ్బందిపడుతారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక రాబడి తగ్గుతుంది. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. అనుకోని చోట నుంచి చెడు వార్తలు వింటారు. మహిళలకు పని భారం. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : మంచి సమయం. అర్థిక పరిస్తితులు ఆశావహంగా ఉంటాయి. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు. వైద్యం, మీడియా రంగంలో వారికి అనుకోని అవకాశాలు వస్తాయి. మహిళలకు శుభవార్త శ్రవణం. గురు పూజ లేదా గురు సంబంధ శ్లోకాలు చదువుకోండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మంచి స్థితి. ఉత్సాహంగా ఉంటారు. పనులు పూర్తిచేస్తారు. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. విద్యార్థులు మంచి వార్తలు వింటారు. ముఖ్య విషయాల గురించి పెద్దలతో చర్చిస్తారు. మహిళలకు మంచి రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోండి లేదా వినండి.

మీనరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. అనుకోని ఆర్థిక ఇబ్బందులు. సోదరులతో కలహాలు. బంధవుల నుంచి ఇబ్బందులు. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీ దత్తారాధన లేదా సాయిబాబా ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి