Zodiac Signs : జూలై 12 మంగళవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా మందగమన పరిస్థితి. విద్యా, ఉద్యోగ విషయాలలో చికాకులు వస్తాయి. ఇంటా, బయటా అనుకోని మార్పులు సంభవిస్తాయి. అమ్మవారి దేవాలయం ప్రదక్షణలు చేయండి. వృషభ రాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఊహించని సంఘటలను జరుగుతాయి. విశ్రాంతి కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. పై అధికారుల మన్నననలు పొందుతారు. విద్యా, ఉపాధిలో అనుకూలత. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : సంతోషంతో నిండిన రోజు. ఆదాయం వనరులు పెరుగుతాయి. విద్యార్థులకు శుభకరమైన రోజు. అమ్మ తరపు వారి నుంచి లాభాలు. ప్రయాణ సూచన. శుభకార్య యత్నం. మహిళలకు మంచి రోజు. శ్రీ నవగ్రహారాధన చేయండి.
సింహ రాశి ఫలాలు : అన్నింటా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం తగ్గుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే పెద్దల సలహాలు తప్పక తీసుకోండి. ఆస్థి సంబంధ వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని మార్పులు వస్తాయి. ఈశ్వరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అమ్మ తరుపు వారి నుంచి లాభాలు వస్తాయి. ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. అనుకోని మార్పులు సంభవిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ కోసం పొదుపు ఆలోచనలు చేస్తారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారదన చేయండి.
తులారాశి ఫలాలు : అన్నింటా మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనుకోని వివాదాలకు ఆస్కారం ఉంది. భార్య/భర్త తరపు వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. ధనం కోసం తాపత్రయ పడుతారు. సంతానం వల్ల ఇబ్బందులు. మాటపట్టింపులు. కాలభైరావారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడుతారు. ఆదాయం పెరుగతుంది. విద్యార్థులకు చక్కటి రోజు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అన్నింటా సానుకూల ఫలితాలు వస్తాయి, ధన సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. మీ పిల్లల వల్ల సంతోషకరమైన వార్తలు వింటారు. మహిళలకు స్వర్ణలాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అన్నింటా ఉత్సాహంగా ఉంటుంది. ఇంటా, బయటా అనుకూలమైన వాతావరణం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొంత కష్టపడాల్సిన రోజు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. పక్క వారితో తగాదాలు రావచ్చు జాగ్రత్త. ప్రయాణ సూచన కనిపిస్తుంది. మంచి పనులు చేద్దామనుకున్నా జాప్యం జరుగుతుంది. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : అన్ని పనులలో జాప్యం జరుగుతుంది. కానీ ధైర్యంతో మీరు ముందుకు పోతారు. విద్య, ఉపాధి విషయాలలో సానుకూలత కనిపిస్తుంది. చాలా కాలంగా వాయిదా వేస్తున్న నిర్ణయాలను ఈరోజు మిత్రుల సహకారంతో తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదు. హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.