Zodiac Signs : జూలై 22 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : జూలై 22 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :21 July 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు చాలా మంచి విసయాలను తెలుసుకుంటారు. ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకుంటారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు అనుకూలైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాల్సిన రోజు. ఈరోజు మీ భాగస్వామి నుంచి చెడువార్త వినే అవకాశం ఉంది. అదృష్ట రంగు నీలం. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం కనీసం 3 సార్లు చదువుకోండి మంచి ఫలితాలు వస్తాయి. వృషభరాశి ఫలాలు : ఈరోజు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు అనుకూలమైన రోజు. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. గురువు సంచార పలితంగా మీకు కొంత ధనలాభాలు రావచ్చు. ఆరోగ్యం కోసం తప్పనిసరిగా జాగ్రత్తలను ఈరోజు నుంచి ప్రారంభించండి. విశ్రాంతి తప్పక తీసుకోవాలి. ప్రేమికుల మధ్య కమ్యూనికేషన్స్‌ జాగ్రత్తగా చేయాలి. అమ్మవారి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన రోజు. గురు బలం అంతగా ఉండదు. వాహనాలు, కొత్త వస్తువులను కొనుగోలు చేయకండి. కెరీర్‌ పరంగా బాగుంటుంది. అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలమైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. కానీ మెడిటేషన్‌ వంటి వాటితో మరింత ఆరోగ్యం పెంచుకోండి. ప్రయాణాల వల్ల లాభాలను, ఆనందాన్ని పొందుతారు. ప్రేమికులకు అద్భుతమైన రోజు. దీనికి కారణం చంద్రగ్రహ సంచారం. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. వృత్తి పరంగా కొంత ఆర్థిక లాభాలు వస్తాయి. ధనసంబంధ విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన రోజు. సరైన ఆహారం ఈరోజు మీకు అవసరం. చంద్ర సంచారం ప్రకారం ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో గడపటం చాలా అవసరం. ప్రయాణం చేయడం వల్ల మానసిక సంతృప్తి పొందుతారు. దుర్గాదేవి ఆరాధన, స్తోత్రం చదువడం వల్ల మంచి జరుగుతుంది.

Today Horoscope July 22 2022 Check Your Zodiac Signs

Today Horoscope July 22 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : ఈరోజు అనవసర ఖర్చులు చేయకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్య సంబంధ విషయాలలో చొరవ తీసుకోని ముంపదకుపోండి. గురు బలం వల్ల ఆర్థిక లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటపట్టింపులు ఉండవచ్చు. చక్కటి ప్రేమ అనుభూతులను ఈరోజు పొందుతారు. మిత్రులతో కలసి చేసే ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ లక్ష్మీ, కుబేర ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

కన్యారాశి ఫలాలు : గురువు వల్ల మీకు అనుకోని లాభాలు వస్తాయి. మంచి జరుగుతుంది. పై అధికారులు మిముల్ని ప్రశంసిస్తారు. పని భారం కొంత పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త తప్పనిసరి. మీ బాధ లేదా సమస్యలను కుటుంబ సభ్యులు లేదా మిత్రులకు చెప్పండ మంచి సలహాలు లభిస్తాయి. ప్రేమికులకు ఉత్సాహంగా ఉంటుంది. అమ్మవారి దేవాలయంలో పూజ, ప్రదక్షణలు చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు కెరీర్‌ లేదా వృత్తి పరంగా చాలా బాగుంటుంది. మీ తెలివి తేటలకు పదును పెడుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రయాణాలకు అనువైన రోజు కాదు. ఆర్థికంగా చక్కటి శుభదినం. ఆరోగ్యం పరంగా బాగుంటుంది. దీనితో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ప్రేమికులకు ఉత్సాహకరమైన రోజు. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.

వృశ్చికరాశి ఫలాలు : చేసే పనులలో ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. చేతిలో ధనాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మంచి వార్తలు వింటారు. కొంత అనారోగ్య సూచన కనిపిస్తుంది. రవి గ్రహ సంచారం మేరకు మీరు ఈరోజు పేదలకు, బలహీనులకు సహాయం చేస్తారు. ప్రేమికులకు, వివాహం అయిన వారికి ఈరోజు ఎైగ్జెటింగ్‌గా ఉంటుంది. మహాలక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : పని చేసే చోట మీ పై వత్తిడి పెరుగుతుంది. అనవసర విషయాల జోలికి ఈ రోజు వెళ్లకండి. పని పైనే దృష్టి పెట్టాల్సిన రోజు. మిత్రులతో విహార యాత్రలకు ప్లాన్‌చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాల్సిన రోజు. అన్నింటా మిశ్రమం ఫలితాలు సాధిస్తారు. వినాయక ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బంది, నష్టాలతో కూడిన రోజు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోండి. సాయంత్రం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలలో సంతోషం, అనుకూలత ఉంటుంది. ప్రేమికులకు మంచి రోజు. విద్య, వివాహ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ అష్టోతరం పూజతో అమ్మవారిని ఆరాధించిన శుభఫలితాలు వస్తాయి.

కుంభరాశి ఫలాలు : స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. పనిచేసే ప్రదేశంలో ఈరోజు అనుకూలత తక్కువగా ఉంటుంది. గంభీరతతో కూడిన రోజు. స్నేహితుల వల్ల మనస్సు ప్రశాంతత కలుగుతుంది. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

మీనరాశి ఫలాలు : ఆర్థిక పరిస్తితి మెరుగుపడుతుంది. కెరీర్‌ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి ఆహారం లభిస్తుంది. ఆలోచనలలో కొత్తదనం పెరుగుతుంది. ప్రేమికులకు మామూలు రోజు. కుటుంబ పరంగా ఆనందంతో నిండిన రోజు. పెట్టుబడులకు అనకూలత కనిపిస్తుంది. శ్రీ లలితాదేవి సహస్రనామాలను పారాయణం చేయండి శుభ ఫలితాలు వస్తాయి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి