Zodiac Signs : జూలై 25 సోమవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : ఈరోజు అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. తల్లి తరఫువారి నుండి ప్రయోజనాలు చేకూరుతాయి. విద్య, ఉద్యోగం, అన్నిట్లో లాభం. ఇష్టదేవతారాధన చేసుకోండి. వృషభ రాశి : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా ఫర్వలేదు. వ్యపారాల్లో పెద్దగా లాభాలు రావు. విలువైన వస్తువుల విషయాల్లో జాగ్రత్త. అనారోగ్య సమస్యలు, ప్రయాణ చికాకులు, మాట పట్టింపులు ఉంటాయి. మంచి ఫలితాల కోసం మల్లికార్జున స్వామి అభిషకం చేసుకోండి.
మిథున రాశి ఫలాలు ; ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకోనిచోటనుంచి లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకు మంచి రోజు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మహిళలకు శుభదినం. లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ; ఈరోజు అన్ని వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్య, ఉద్యోగ విషయాల్లో సానుకూల ఫలితాలు. స్త్రీ సంబంధ లాభాలు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రుద్రాభిషేకం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
సింహ రాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అప్పులకోసం ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక మందగమనం. అనుకోని వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మహిళలకు పని భారం పెరుగుతుంది. కాలభైరవాష్టకం చదువుకోండి.
కన్య రాశి ఫలాలు : ఈరోజు అన్ని విషయాల్లో అనుకూల ఫలిత లభిస్తుంది. చాలా రోజులుగా పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. మహిళలకు వస్త్ర లాభం. ఈరోజు శివాష్టకం చదువుకోవడం మంచిది.
తుల రాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే పనుల్లో జాప్యం పెరుగుతుంది. ఆర్థికంగా సాధారణ స్థితి. మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. బాగా కష్టించి పని చేయాల్సిన రోజు. భూ వివాదాలకు ఆస్కారం. అమ్మవారి ఆలయంలో దీపారాధన, ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి ఫలాలు : మీరు ఊహించని విధంగా ఈరోజు గడిచిపోతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఈరోజు లాభాన్ని తెస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు, బంధువుల రాక, ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇష్టదేవతారాధన చేసుకోండి.
ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి. ఆర్థిక మందగమనం. ఉమ్మడి వ్యాపారాలతో నష్టం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తప్పక తీసుకోండి. ప్రయాణ సూచన. సాయంత్రం నుంచి మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.
లక్ష్మీగణపతి ఆరాధన చేసుకోండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. విద్యార్థులకు, మహిళలకు చక్కటి రోజు. శ్రీరామలింగేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు తీవ్రమైన శ్రమతో మీరు చేసే పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కాని ఖర్చులు కూడా పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్య, ఉద్యోగ విషయాల్లో మామూలుగా ఉంటుంది. రుద్రాభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
మీన రాశి ఫలాలు ; ఈరోజు ప్రతి విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్థి సంబంధ వివాదాలు రావచ్చు. పంచామృతాలతో శివాభిషేకం చేయించుకోండి.