Zodiac Signs : జూలై 27 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : ఉత్సాహంగా ఈరోజు ముందుకు వెళ్తారు. బంధువులు రుణం కోసం మీ దగ్గరకు వస్తారు. కానీ ఆలోచించి ఇవ్వండి. పనులలో వేగం పెరుగుతుంది. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆదాయం వనరులు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమికులకు ఎగ్జైటింగ్ గా ఉంటుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఆర్థికంగా లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సమస్యలను పంచుకుని ఊరట పొందుతారు. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమికులు మనసు విప్పి మాట్లాడుకోవడానికి అనుకూలమైన రోజు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేయండి సానుకూల ఫలితాలు వస్తాయి. ప్రయాణంతో ఆనందాన్ని పొందుతారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన సమయం. ఈరోజు పొదుపు చేయాల్సిన సమయం. మీకు అందిన సమాచారం ఇంట్లో అందరికీ సంతోషం కలిగిస్తుంది. ప్రేమికులకు మంచి రోజు. ధనం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయం వృథా చేస్తారు. మహిళలకు మంచి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. చాలా ఎగ్జైట్ మెంట్గా ఉంటుంది. ఆర్థిక పరిస్తితి బాగుంటుంది. అవసరానికి తగినంత ధనం వస్తుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. ప్రేమ జీవితంలో వివాదాలకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు వస్తాయి. అవకాశాలు వస్తాయి. వైవాహిక జీవితానికి కొన్ని చెడు ఫలితాలు రావచ్చు జాగ్రత్త. అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయండి.

Today Horoscope July 27 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు కొంత క్లిష్టంగా ఉంటుంది. ఈరోజు వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన రోజు. అనుకోని సమస్యలు వస్తాయి. బంధువుల నుంచి వత్తిడి పెరుగుతుంది. ప్రేమికుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. సీనియర్ల సలహాలను పొందితే మంచి లబ్దిని పొందుతారు. కొత్త అలవాట్లను చేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనకూలమైన రోజు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ కుజగ్రహారాధన, దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు మీ అవసరాలకు తగ్గ ధనాన్ని సంపాదిస్తారు. దీనితో ఆర్థిక సమస్యలు వస్తాయి. పొదుపు చేస్తారు. ఇంట్లో, బయటా సంతోషంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య ఆకర్షణ మరింత పెరుగుతుంది. వివాహ జీవితం బాగుంటుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలత పెరుగుతుంది. రియల్‌ రంగంలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ లలితాదేవీ ఆరాధన చేయండి.

తులా రాశి ఫలాలు : కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఈరోజు విశ్రాంతి సమయం దొరుకుతుంది. వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు వస్తాయి. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు అనవసర ఖర్చులు వస్తాయి. ఆరోగ్యం కోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సమయం వృథా చేయకండి. వివాదాలకు అవకాశం ఉంది. ప్రయాణాలలో చికాకులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని పరిస్థితిలో ఇబ్బందులు పడుతారు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మీ మిత్రుల సలహాలతో ఆర్థికంగా పుంజుకుంటారు. మీ మాటల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ప్రేమ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. దీర్గకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. మహిళలకు వస్త్రలాభాలు కలుగుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం. నెలకొంటుంది. శ్రీ లలితాదేవికి మందారాలతో ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈ రోజు మీరు చేసే పనులలో లీనం అవ్వడం వల్ల మంచి జరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ఆలోచన చేస్తారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలలో అంత అనుకూలత ఉండదు. వివాహ ప్రయత్నాలలో అనుకూలత ఉండదు. మహిళలకు పని భారం, వత్తిడి పెరుగుతుంది. శ్రీ అనుజ్ఞ గణపతి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. అందరికీ సహాయం చేయాలని భావిస్తారు కానీ అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. బంధువులు, మిత్రుల సలహాలతో ఆర్థికస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. భవిష్యత్‌కు సంబంధించిన ప్లాన్‌లు చేస్తారు. తెలిసి ఈరోజు తప్పులు చేస్తారు. జీవిత భాగస్వామితో అనుకోని వివాదాలు వస్తాయి. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు పెట్టుబడులకు మంచిరోజు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు. చాలా కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ, సరస్వతి ఆరాధన చేయండి.

Recent Posts

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

2 minutes ago

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?

Gym  : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…

1 hour ago

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విష‌యంలో శ్రద్ధగా ఉండాలి..!

Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…

2 hours ago

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

3 hours ago

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…

4 hours ago

Varalakshmi Vratham : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.. ఏయే నైవేధ్యాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా..?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…

5 hours ago

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

14 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

15 hours ago