Zodiac Signs : మార్చి 13 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 12 March 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : చక్కటి అనుకూల వాతావరణం. కుటుంబంలో శుభ వార్తలతో సంతోషం. అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. మహిళలకు శుభ సూచకాలు కనిపిస్తాయి. శ్రీ సూర్యనారాయణ ఆరాధన చేయండి. వృషభ రాశిఫలాలు : ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. ధనలాభాలు కనిపిస్తున్నాయి. మహిళలకు మానసిక సంతోషం. కుటుంబంలో శుభకార్య యోచన. అమ్మవారి ఆరాధన చేయండి.

మిధున రాశి ఫలాలు : విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలుకు అవకాశం. ఆర్తికంగా చక్కటి రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం. విద్యార్థులకు విదేశీ యోగంకు బాటలు. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : బాగా కష్టపడాల్సిన రోజు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. చేసే పనులలో జాప్యం కనిపిస్తుంది. ఎవరితో అనవసరంగా వివాదాలకు తావు ఇవ్వకండి. శ్రీ వినాయక ఆరాధన చేయండి.

Today Horoscope March 13 2022 check your zodiac signs

Today Horoscope March 13 2022 check your zodiac signs

సింహ రాశిఫలాలు : పెద్దల సహాయం, సహకారాలు అందుతాయి. అనారోగ్యం నుంచి విముక్తి. ధనలాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. మహిళలకు సంతోష వార్తలు. ఇష్టదేవతరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : చక్కటి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా సంతోషకరమైన రోజు. మీరు చేసిన పనుల ద్వారా గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మికంగా ప్రయాణం. మహిళలకు పరపతి పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

తుల రాశి ఫలాలు : మీరు చేసే పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆఫీస్‌లో, బయటా మీకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థిక విషయాలు మంచిగా సాగుతాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. కాలభైరావాష్టకం చదవండ.

వృశ్చికరాశి ఫలాలు : ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధితో ఆలోచించి పనులు చేయండి. ఆర్థిక విషయాలలో నష్టాలు. వ్యాపారాలు మామూలుగా ఉంటాయి. విందులు, వినోదాలతో సమయం వృథా చేస్తారు. శ్రీ దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.

ధనస్సురాశి ఫలాలు : సానుకూలమైన రోజు. అన్నింటా విజయాలు సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అప్పులు తీరుస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు. మహిళలకు మంచిరోజు. నవగ్రహారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ధైర్యంతో ముందుకుపోతారు విజయాలు సాధిస్తారు. అప్పులు తీరుస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆఫీస్‌లో అందరి ప్రశంసలు అందుకుంటారు. బం విందు, వినోదలలో పాల్గొంటారు. అమ్మవారి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : చికాకులు, అనారోగ్య సమస్యలు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అన్ని రకాల వ్యాపారులు ఆలోచించి ముందుకు పోవాలి. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. విలువైన వస్తువులు జాగ్రత్త.

మీన రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. దూరపు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.సమస్యలు వస్తాయి కానీ మీ తెలివితేటలతో వాటి నుంచి బయటపడుతారు. శివాభిషేకం చేయించండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి