Zodiac Signs : మార్చి 17 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : మార్చి 17 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

 Authored By prabhas | The Telugu News | Updated on :16 March 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆర్థికంగా సాదారణంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. ప్రయాణాల వల్ల చికాకులు. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి.
వృషభ రాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం చెడు ఫలితాలు వస్తాయి. ఈరోజు ఎవరికి మాట ఇవ్వద్దు. అప్పులు ఇవ్వద్దు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ విషయాలలో జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో మార్పులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి మంచి ఫలితం వస్తుంది.

మిథున రాశి ఫలాలు : ఈరోజు అనవసర ఖర్చులు పెరుగుతాయి,. చికాకులు వస్తాయి. మీ తెలివితేటలతో ముందుకు వెళ్తారు. చెప్పుడు మాటలు వినవద్దు. సాయంత్రం నుంచి శుభ పరిణామాలు జరుగుతాయి. మహిళలకు లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులు ప్రారంభించడానికి సరైన సమయం. అయితే మీ శక్తిని మించిన పనులకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయాలలో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఆదాయం అనుకున్నంత రాదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. శ్రీ కాళికాదేవి ఆరాధన చేయండి.

Today Horoscope march 17 2022 check your zodiac signs

Today Horoscope march 17 2022 check your zodiac signs

సింహ రాశిఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు మాత్రం సజావుగా, లాభాల బాటలో నడుస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మహిళలక విశ్రాంతి లేక ఇబ్బంది పడుతారు. శ్రీ సాయిబాబా ఆరాధన/దత్తాత్రేయస్వామి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో మనస్పర్థలు. అనవసర వివాదాలు రావచ్చు. ఓపికతో ఉండటం ఈరోజు ముఖ్యం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : కొత్తవారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు ధనలాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ సూక్తంతో పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటా, బయటా అనుకూల వాతావరణం. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. మహిళలకు వస్త్ర లాభాలు. ఇష్టదేవతారాధన చేసుకోండి,.

ధనుస్సు రాశి ఫలాలు : శుభ వార్తలు వింటారు. అప్పుల బాధల నుంచి విముక్తికి ప్రయత్నిస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. మంచి ఆహారం, విశ్రాంతి లభిస్తుంది. మహిళలకు చక్కటి శుభదినం. శ్రీ దక్షిణమూర్తి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. అర్థిక పరిస్థితిలో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రుల సహకారంతో ముందుకు పోతారు. మహిళలకు శుభ ఆహ్వానాలు అందుతాయి. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొంచెం ప్రతికూల వాతావరణం. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు వస్తాయి. పెద్దల మాటలు వినకపోవడం వల్ల నష్టాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

మీన రాశిఫలాలు : చక్కటి శుభదినం. మంచి ఆహారం లభిస్తుంది. ఆర్థిక విషయాలలో అనుకున్న విధంగా ఉంటాయి. శుభ కార్య యోచన. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టమైన వారి నుంచి ఫోన్‌ కాల్ రావడం సంతోషం కలిగిస్తుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి