Zodiac Signs : మార్చి 27 ఆదివారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేష రాశి ఫలాలు : ప్రతికూల వాతావరణంలో ఈరోజు గడుస్తుంది. ధైర్యంతో ఈరోజు ముందుకు పోతారు. అప్పుల బాధలు తీరుతారు. ఆత్మీయుల నుంచి సహకారం అందక మనస్తాపం చెందుతారు. మహిళలకు బాధలు పెరుగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు మీకు కొంచెం మంచి, కొంచెం చెడు జరుగుతుంది. ఆర్థిక విషయాలలో చికాకులు పెరుగుతాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు చికాకులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి,
మిథున రాశి ఫలాలు : ఈరోజు తెలివితేటలతో మందుకుపోతారు. అప్పులను తీరుస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. పెద్దల నుంచి మంచి వార్తలు వింటారు. మహిళలకు మంచిరోజు. శ్రీ శివారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీరు అన్ని విషయాలలో జయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి రోజు. కుటుంబంలో సంతోషం, కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆన్నదమ్ముల నుంచి సహయం అందుతుంది. మంచి వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవీ ఆరాధన చేయండి.

Today Horoscope March 27 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : కీలకమైన విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు శుభ వార్తలు వింటారు. ఆర్థిక లాభాల కోసం శ్రమిస్తారు. మహిళలకు శుభ సమయం. శ్రీ రామజయ జయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.
కన్య రాశి ఫలాలు : ఈరోజు కొంచెం శ్రమ పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి విముక్తి. ఇంట్లో వారి నుంచి వత్తిడి వస్తుంది. కుటుంబంలో సమస్యలు రావచ్చు. పెద్దల మనసు నొప్పించకుండా మసులుకోవాల్సిన రోజు. మహిలలకు వంటింటి భారం పెరుగుతుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తుల రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలతో సంతోషంగా గడుపుతారు. ఆనుకున్న దాని కంటే ముందే పనులు పూర్తిచేస్తారు. మిత్రులతో కలసి ఎంజాయ్ చేస్తారు. ఆర్థికంగా శుభకరమైన రోజు. మంచి వ్యక్తుల సాన్నిహిత్యం లభిస్తుంది. ఇష్టదేవతారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మీకు ఈరోజు అన్ని వైపుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉల్లాసంగా ఈరోజు గడుపుతారు. కుటుంబంలో చక్కటి సహకారం అందుతుంది. విలువైన వస్తువులు కొంటారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేసుకోండి.
ధనుస్సు రాశి ఫలాలు : మంచి ఫలితాలను సాధిస్తారు. కుటంబంలో సంతోష వాతావరణం కనిపిస్తుంది. దూర ప్రాంతాలనుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ లక్ష్మీ సూక్తం పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు : వివాదాలకు అవకాశం ఉంది జాగ్రత్త. తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయండి. అన్నదమ్ముల మధ్య అవగాహన లోపిస్తుంది. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : మీకు చాలా ఆనందంగా ఈరోజు గడుస్తుంది. అప్పులను తీరుస్తారు. తెలివితేటలను ఉపయోగించి ముందుకుపోతారు. అమ్మ తరుపు వారి నుంచి శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి అనుకూలమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
మీన రాశి ఫలాలు : మీకు ఈరోజు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. అందరి నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. అప్పుల బాధలు తీరుతాయి. పెద్దల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబంలో చికాకులు పోతాయి. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.