Zodiac Signs : నవంబర్ 14 సోమవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : నవంబర్ 14 సోమవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

 Authored By prabhas | The Telugu News | Updated on :13 November 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆర్థిక ఇబ్బందులు. అనవసర ప్రయాణాలు. ఈరోజు అనారోగ్య సూచన.కుటుంబంలో సమస్యలు తప్పవు. మహిళలకు ఇబ్బందులు వస్తాయి. శివాభిషేకం చేయించండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు, ఆర్థికంగా సాధారణ స్తితి. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. ఆఫీస్లో పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సాధారణంగా ఉంటుంది. మహిళలకు చక్కటి శుభఫలితాలు ఉంటాయి. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : కొత్తగా పనులు ప్రారంభిస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు. ఆదాయం కొంచెం పెరుగుతుంది. వ్యాపారాలలో స్వల్పంగా లాభాలు. అన్నదమ్ముల నుంచి ప్రయోజనాలు పొందుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చాలా కాలంగా వసూలు కాని బాకీలు వసూలు అవుతాయి. అన్నింటా మీకు సానుకూలమైన ఫలితాలు. ఆస్తి వ్యవహారాలు అనుకూలం ఉంటాయి.అప్పులు తీరుస్తారు. కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope November 14 2022 Check Your Zodiac Signs

Today Horoscope November 14 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అన్నింటా మీకు చికాకులు వస్తాయి. కానీ ధైర్యంతో ముందుకుపోతారు. కొత్త పెట్టుబడలుకు పెద్దగా అనుకూలం కాదు. అనవసర ఖర్చులు. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ రుద్రాభిషేకం పారాయణం చేయండి.

కన్య రాశి ఫలాలు : శ్రమతో మీరు విజయం సాధిస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి కానీ వాటిని అధిగమిస్తారు. అప్పులు తీరుస్తారు. అమ్మ తరపు వారి నుంచి ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలో సఖ్యత కోసం అందరూ ప్రయత్నిస్తారు. శ్రీ లక్ష్మీ, శివారాధన చేయండి.

తులారాశి ఫలాలు ; ఈరోజు మీరు చక్కటి శుభవార్తలు వింటారు.ఆఫీస్‌లో మీకు ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు.శివారాధన చేయండి

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అప్పులు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తెలివితేటలకు పని చెప్పాల్సిన రోజు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. మహిళలకు మంచి వార్తలు. శ్రీ సోమ్వేరస్వామి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు ; కష్టంతో కూడిన రోజు. ఆదాయం తగ్గుతుంది. అన్నింటా మీకు ఇబ్బందులు రావచ్చు. ఆర్థికంగా మీరు ఇబ్బందులు పడుతారు. అనుకోని ఖర్చులు వస్తాయి. ప్రయాణ సూచన. కుటుంబంలో పెద్దల సలహాలతో ముందుకుపోతారు. శ్రీ శివకవచం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : అన్ని రంగాల వారికి అనుకూలం. ఈరోజు సాయంత్రం నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు మీరు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆఫీస్లో, బయటా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.ఇష్టదేవతరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండాలి. అన్నింటా మీకు శ్రమతో కూడిన పరిస్థితి. ఈరోజు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆఫీస్లో మీరు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన రోజు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు మంచి రోజు. శ్రీ శివాభిషేకం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరాశి వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు. ఈరోజు మీరు కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు పోయి లాభాలు గడిస్తారు. మానసిక ఆనందంగా పెరుగుతుంది. మహిళలక చక్కటి రోజు. శివుడికి పంచామృతాభిషేకం చేయించండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది