Zodiac Signs : నవంబర్ 15 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?
మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని పనులు మీ ముందుకు వస్తాయి. జాగ్రత్తగా ఆలోచించి ముందుకుపోండి. అన్నింటా వత్తిడి ఎక్కువ అయినా చివరకు పలితాలు మీకు అనుకూలం. సంతానం వల్ల సంతోషం. మహిళలకు పనిభారం, ధనలాభం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి. వృషభ రాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. మీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. అన్నింటా మీకు అనకూలమైన ఫలితాలు వస్తాయి. మహిళలకు మంచిరోజు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : కొద్దిగా చికాకులు వస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో పెద్దగా మార్పులు రావు. విద్యార్థులు బాగా శ్రమించాల్సినరోజు. అప్పుల కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. పెద్దల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. ట్రేడింగ్ అనుకూలం. మహిళలకు చక్కటి ఫలితాలు. శ్రీ హనుమాన్చాలీసా పారాయన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మధ్యస్తంగా ఉంటుంది ఈరోజు. అన్నింటా మీకు శ్రమతోకూడిన ఫలితాలు. ప్రయాణ సూచన. అదాయంలో ఆశించిన ఫలితాలు రావు. మహిళలకు లాభదాయకమైన రోజు. ఆఫీస్లో పని వత్తిడి, పై అధికారుల ద్వారా సహకారం లభిస్తుంది. దుర్గాదేవి ఆరాదన చేయండి.
సింహరాశి ఫలాలు : పర్వాలేదు. అన్నింటా మీకు సానుకూలమైన పవనాలు వీస్తాయి. ఆదాయంలో కొంచెం పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో స్వల్ప మార్పులు. ప్రయాణ సూచన. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. కొత్త పనులు ప్రారంభానికి అవకాశం ఉంది. ఇష్టదేతరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలతో కూడిన రోజు. ఆదాయంలో పెరుగుదల, అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మంచి పేరు సంపాదిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి ఆస్తి విషయాలలో సానుకూల ఫలితాలు. శ్రీ ఆంజనేయస్వామి దండకం చదువుకోండి.
తులారాశి ఫలాలు : కొద్దిగా శ్రమించాల్సి నరోజు. ఆదాయం కోసం కొత్త మార్గాలన అన్వేసిస్తారు,. వ్యాపారాలలో ఆచితూచి కొత్త పెట్టబడులు పెట్టండి,. అన్నింటా మీకు శ్రమ పెరుగుతుంది. సాయంత్రం నుంచి కొంచెం ఊరట లభిస్తుంది. మహిళలకు మంచి రోజు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలమైన రోజు కావచ్చు. ఓపికతో ముందుకు పోవాల్సిన రోజు. ఆదాయం తగ్గుతుంది. అన్నింటా మీకు ఆటంకాలు వస్తాయి. అనవసర ఖర్చులు, సమయం వృథా అవుతుంది. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణ చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అనుకూలత, ప్రతికూలతతో కూడిన రోజు. కొద్దిగా శ్రమించాల్సి వస్తుంది. చెడు వార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా మాత్రం సమాన్యంగా ఉంటుంది. మహిళలకు ధనలాభాలు. శ్రీ శివాభిషేకం చేయిండి.
మకర రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలత కనిపిస్తుంది. ఓపికతో ముందుకు పోండి. అనవసర విషయాలలోజోక్యం చేసుకోకండి. ఆకస్మిక ప్రయాణ సూచన. విద్యార్థులకు శ్రమతోకూడిన రోజు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో మందగమనం. మహిళలకు చికాకలు. శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
కుంభ రాశి ఫలాలు ; చక్కటి శుభదినం ఈరోజు. ఆదాయం పెరగుతుంది. వ్యాపారాలలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆస్తి సంబంధ విషయాలలో అనుకూల ఫలితాలు., కోర్టు వ్యవహారాలలో లాభదాయకంగా ఉంటాయి. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : అనుకూలంగా ఉంటుంది. కాకపోతే అనుకున్న దానికంటే తక్కువగా ఫలితాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అన్నింటా మీకు పర్వాలేదు అన్నవిధంగా ఉంటుంది. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలత. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.