Zodiac Signs : నవంబర్ 19 శనివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : నవంబర్ 19 శనివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

 Authored By prabhas | The Telugu News | Updated on :18 November 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయం తగ్గుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ధైర్యంతో ముందుకుపోతారు. ఆనుకోని వారి నుంచి నష్టాలు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకున్న పనులలో జాప్యం జరుగుతుంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఆపీస్లో మీకు పని వత్తిడి పెరుగుతుంది. ఆనుకోని ఖర్చులు వస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : చక్కటి రోజు. మంచి ఫలితాలు సాధిస్తారు. పనులలో పురోగతి కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు. శ్రీ లక్ష్మనారాయణ స్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మనుసులో ఉన్న ఆలోచనలకు కార్యరూపంలో పెడుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో చక్కటి రోజు. విద్య, ఉపాధి విషయాలలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. మహిళలకు చక్కటి రోజు, ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope November 19 2022 Check Your Zodiac Signs

Today Horoscope November 19 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : చక్కటి ప్రశాంతమైన రోజు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అన్నింటా మీకు జయం కలుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. అన్నదమ్ముల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. మహిళలకు ధనలాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : సాధారణంగా ఉంటుంది. అనుకోని చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం కానీ ధైర్యంతో ముందుకుపోతారు. ఆదాయం తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రాకున్న సంతృప్తి కలుగుతుంది. అనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. శ్రీ రామ తారకాన్ని జపించండి.

ధనుస్సు రాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం. ఆనుకోని ఖర్చులు. ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. దూర ప్రయాణ సూచన. పెద్దల సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. మహిళలు స్వర్ణ లాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మరక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయం తగ్గిన అవసరానికి ధనం చేతికి అందుతుంది. శారీరక బాధలు పెరుగుతాయి. విద్యా అవకాశాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు లాభాలు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన రోజు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆఫీస్లో మంచి వార్తలు వింటారు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : కొద్దిగా ఆలోచించి పనులు ప్రారంభించండి. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆఫీస్లో పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబంలో మంచి వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది